వైజాగ్‌లో నిర్వహించనున్న ప్రతిష్టాత్మక సదస్సుల ఏర్పాట్లపై సీఎం జగన్ సమీక్ష, అధికారులకు కీలక ఆదేశాలు

CM Jagan Held Review on The Arrangements For G20 Working Group Meeting and Global Investments Summit in Vizag,CM Jagan Held Review,Arrangements For G20,Working Group Meeting,Global Investments Summit in Vizag,Mango News,Mango News Telugu,Tdp Chief Chandrababu Naidu,AP CM YS Jagan Mohan Reddy,YS Jagan News And Live Updates, YSR Congress Party, Andhra Pradesh News And Updates, AP Politics, Janasena Party, TDP Party, YSRCP, Political News And Latest Updates

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో విశాఖపట్నం వేదికగా మార్చి నెలలో రెండు ప్రతిష్టాత్మక సదస్సులు జరుగనున్నాయి. వీటిలో ప్రధానంగా జీ-20 వర్కింగ్ గ్రూప్ సన్నాహక సమావేశంతో పాటు గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్-2023లు ఉన్నాయి. ఈ కార్యక్రమాల కోసం అధికారులు ఇప్పటినుంచే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రులు రాజన్న దొర, ముత్యాల నాయుడు, హోంమంత్రి తానేటి వనిత, మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్, అమర్‌నాథ్, ఆదిమూలపు సురేష్, విడదల రజినీ, సీఎస్ జవహర్ రెడ్డి సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ అధికారులకు కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు.

వైజాగ్‌లో ప్రతిష్టాత్మక సదస్సుల ఏర్పాట్లపై సీఎం జగన్ కీలక ఆదేశాలు, సూచనలు..

  • ఈ కార్యక్రమాలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి.
  • విశాఖ నగరాన్ని సుందరంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి.
  • నగరంలోని ప్రధాన రోడ్లు, జంక్షన్లు సహా బీచ్ రోడ్డులో సుందరీకరణ పనులు చేపట్టాలి.
  • మార్చి 3, 4 తేదీల్లో ఏపీలో గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సును నిర్వహించనున్న నేపథ్యంలో సన్నాహకాలు పకడ్బందీగా చేయాలి.
  • రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముందుకు సాగాలి.
  • రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను వారికి ప్రత్యేక యాప్ ద్వారా తెలియజేయాలి.
  • అలాగే మార్చి 28, 29 తేదీల్లో జీ-20కి సంబంధించిన మౌలిక వసతుల వర్కింగ్ మీటింగ్ కోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలి.
  • ఇక జీ-20 సదస్సుకు సభ్య దేశాల నుంచి దాదాపు 250 మంది అతిథులు రానున్నారు.
  • ఒక్కో దేశం నుంచి 6గురు చొప్పున, అంతర్జాతీయ సంస్ధల తరపున మరో 4గురు పాల్గొననున్నారు.
  • ఇంకా కేంద్రం నుంచి మరో 100 మంది అతిథులు రానున్నారు.
  • ఈ సమావేశాలకు వచ్చే అతిథులకు ఆతిథ్యం, రవాణా వంటి ఏర్పాట్లు విషయంలో లోటు లేకుండా చూసుకోవాలి.
  • అలాగే ఈ ఈ సమావేశాలకు వచ్చే ప్రతినిధులు నగరం పరిధిలోని పర్యాటక ప్రదేశాలకు వెళ్లే సమయంలో తగిన ఏర్పాట్లు చేయాలి.
  • ఆయా పర్యాటక ప్రదేశాల్లో ఆహ్లాదకర, పరిశుభ్రమైన వాతావరణం మరియు భద్రతా ఏర్పాట్లపై దృష్టి పెట్టాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 13 =