ఏపీ నుంచి చెన్నైకి వచ్చే నెలలో బస్సులు, హైదరాబాద్ కు కూడా త్వరలో నిర్ణయం

APSRTC, APSRTC and TSRTC Officials Likely to Discuss, APSRTC and TSRTC Officials Will Discuss on Interstate Bus Services, APSRTC Interstate Bus Services, APSRTC News, Interstate Bus Services, interstate bus services in ap, RTC and Interstate bus Services, TSRTC Interstate Bus Services

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నడపడంపై ఏపీఎస్ఆర్టీసీ ప్రణాళికలు రూపొందిస్తుంది. ఇప్పటికే రాష్ట్రం నుంచి కర్ణాటకు బస్సులు నడుపుతుండగా, వచ్చే నెల నుంచి చెన్నై కు కూడా సర్వీసులు ప్రారంభించేందుకు ఆర్టీసీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు నడిపే అంశంపై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తుంది. ఏపీ నుంచి హైదరాబాద్ రూట్ కు అత్యంత ఆదరణ కలిగిన సంగతి తెలిసిందే.

ఇప్పటికే ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీల అధికారుల మధ్య ప్రాథమిక చర్చలు జరగగా, జూన్ నెల చివర్లో జరగాల్సిన కీలక చర్చలు వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 21 తర్వాత టీఎస్ఆర్టీసీ అధికారులతో ఏపీఎస్ఆర్టీసీ అధికారులు చర్చలు జరపనున్నట్లు సమాచారం. చర్చల అనంతరం బస్సు సర్వీసులు ఎప్పుడూ ప్రారంభిస్తారో అనే దానిపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మరోవైపు ఏపీలో కూడా అన్ని జిల్లాల్లో క్రమంగా సర్వీసులు పెరుగుతున్నాయి. ఆగస్టు 7, శుక్రవారం నాటికీ రాష్ట్రంలో తిరిగే బస్సు సర్వీసుల సంఖ్య 2363 కి చేరుకుంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 1 =