కోనసీమలో ‘వైఎస్ఆర్ మత్స్యకార భరోసా’ పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్, లబ్ధిదారుల ఖాతాల్లో 109 కోట్లు జమ

CM YS Jagan Launches YSR Matsyakara Bharosa Scheme in Konaseema Distributes Rs 109 Cr, CM YS Jagan Launches YSR Matsyakara Bharosa Scheme in Konaseema, CM YS Jagan Distributes Rs 109 Cr Funds For YSR Matsyakara Bharosa Scheme, AP CM YS Jagan Distributes Rs 109 Cr Funds For YSR Matsyakara Bharosa Scheme in Konaseema, AP CM YS Jagan Mohan Reddy To Launch YSR Matsyakara Bharos Programme In Konaseema, AP CM Jagan To Participate Matsyakara Bharosa Funds Release Program in Konaseema, AP CM YS Jagan Mohan Reddy to launch fourth phase of YSR Matsyakara Bharosa Funds, CM Jagan To Participate Matsyakara Bharosa Funds Release Program in Konaseema, AP CM To Participate Matsyakara Bharosa Funds Release Program in Konaseema, Matsyakara Bharosa Funds Release Program in Konaseema, Matsyakara Bharosa Funds Release Program, AP CM YS Jagan To Participate Matsyakara Bharosa Funds Release Program, AP CM YS Jagan Mohan Reddy To Participate Matsyakara Bharosa Funds Release Program In Konaseema, Matsyakara Bharosa Funds, Konaseema, Matsyakara Bharosa Funds Release Program News, Matsyakara Bharosa Funds Release Program Latest News, Matsyakara Bharosa Funds Release Program Latest Updates, Matsyakara Bharosa Funds Release Program Live Updates, AP CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, YS Jagan Mohan Reddy, Jagan Mohan Reddy, YS Jagan, AP CM, CM YS Jagan, Mango News, Mango News Telugu,

కోనసీమలో ఈరోజు ‘వైఎస్ఆర్ మత్స్యకార భరోసా’ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. కోనసీమ జిల్లా ఐ.పోలవరం (మం) మురమళ్ల గ్రామంలో లబ్దిదారులకు ఈ పథకం కింద నిధులు అందజేశారు. దీనికింద ఇప్పటికే రైతు భరోసా, వాహన మిత్ర, పెన్షన్ పథకాల ద్వారా లబ్ధి పొందిన మత్స్యకారులకు కూడా ఈ పథకం ప్రయోజనాలను వర్తింపజేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు విశ్వరూప్‌, వేణుగోపాలకృష్ణ, ఎంపీలు చింతా అనురాధ, వంగా గీత, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, ఎమ్మెల్యేలు పొన్నాడ సతీష్‌కుమార్‌, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, కురసాల కన్నబాబు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 1,09,000 మంది లబ్ధిదారులకు ఈ పథకం కింద లబ్ధి కలుగనుందని తెలిపారు. ఇప్పటి వరకు రూ.418 కోట్ల సాయం చేశామని, వరుసగా నాలుగో ఏడాది ఒక్కో కుటుంబానికి రూ.10 వేల చొప్పున ఈ ఏడా 1,08,755 మంది మత్సకారుల ఖాతాల్లో 109 కోట్లు ఈ రోజు జమ చేస్తున్నామని పేర్కొన్నారు. దీనితో పాటు  జీవనోపాధి కోల్పోయిన 69 గ్రామాల 23,548 మందికి రూ.11,500 చొప్పున 4 నెలలపాటు ఓఎన్‌జీసీ చెల్లించిన రూ.108 కోట్ల నష్టపరిహారాన్ని కూడా లబ్ధిదారులకు అందిస్తున్నామని తెలిపారు. మత్స్యకారులకు అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెరిగేలా చర్యలు చేపడుతున్నామని సీఎం జగన్‌ అన్నారు.

ఈ పథకం ప్రకారం.. మెకనైజ్డ్, మోటరైజ్డ్ మరియు నాన్-మోటరైజ్డ్ ఫిషింగ్ నెట్‌లను ఆపరేట్ చేసే మత్స్యకారులకు ఏప్రిల్ 15 మరియు జూన్ 14 మధ్య వార్షిక చేపల వేట నిషేధ కాలానికి రూ.10,000కి ఆర్థిక సహాయం అందించనున్నారు. చేపల వేట నిషేధ కాలానికి మెరుగైన ఆర్థిక సహాయంతో పాటు, లబ్ధిదారులకు రూ.9 చొప్పున పెరిగిన డీజిల్ సబ్సిడీ కూడా లభిస్తుంది. గతంలో లీటరుకు రూ.6 సబ్సిడీ ఉండేది. ఇందుకోసం ప్రభుత్వం 81 ఫిల్లింగ్ స్టేషన్లను గుర్తించింది. అదేవిధంగా, వేటలో మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు ఇచ్చే ఎక్స్‌గ్రేషియా కూడా 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచబడింది. 18 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న మత్స్యకారులకు ఇది వర్తిస్తుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − one =