మున్సిపల్ ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకోవాలి, ప్రజలకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ విజ్ఞప్తి

2021 AP Municipal Elections, Andhra Pradesh Municipal Corporation, Andhra Pradesh Municipal Corporation elections, Andhra Pradesh Municipal elections, Andhra Pradesh Municipal Elections 2021 news and live updates, AP Municipal Elections, AP Municipal Elections 2021, Ap Municipal Elections Campaign, AP Municipal Elections Date, AP Municipal Elections News, AP SEC Nimmagadda Ramesh, AP SEC Nimmagadda Ramesh Appeals People to Cast Their Vote in Municipal Elections, Mango News, Municipal Elections

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చి 10 న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న మున్సిపల్ ఎన్నికలలో ప్రజలంతా విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. మార్చి 10వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల పోలింగ్ జరగనుందని చెప్పారు. అందుకు తగిన అన్ని ఏర్పాట్లను ఎన్నికల సంఘం సమన్వయంతో చేస్తుందని తెలిపారు. విద్యావంతులు, సామాజిక కలిగిన స్పృహ కలిగిన పట్టణ ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఓటు హక్కును వినియోగించుకోవడం సామాజిక బాధ్యత అని గుర్తించి పోలింగ్ లో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సూచించారు. ఈ మున్సిపల్ ఎన్నికలను అందరూ జయప్రదం చేయాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కోరారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here