గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష, ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు

CS Somesh Kumar DGP Mahender Reddy held Teleconference on Arrangements for Group-1 Preliminary Exam, Group-1 Preliminary Exam, CS Somesh Kumar on Arrangements of Group-1 , DGP Mahender Reddy Teleconference on Arrangements for Group-1, Mango News, Mango News Telugu, CS Somesh Kumar Evaluations For Group-1, Telangana CS Somesh Kumar, Telangana DGP Mahender Reddy, Biometric System in Group-I Prelims, Group-1 Preliminary Exam, Group-1 Preliminary Exam Timings, Group-1 Preliminary Exam Date, Arrangements for Group-1 Preliminary Exam,

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌ డా.బి.జనార్దన్‌రెడ్డి, డీజీపీ మహేందర్‌రెడ్డిలు గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లపై మంగళవారం జిల్లా కలెక్టర్లు, పోలీస్‌ కమిషనర్లు, ఎస్పీలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష అక్టోబర్ 16, ఆదివారం నాడు జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 1019 కేంద్రాల్లో 3.8 లక్షల మంది అభ్యర్థులు ప్రిలిమ్స్ పరీక్షలకు హాజరవుతున్నారని, పరీక్ష సజావుగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లను సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశించారు.

స్ట్రాంగ్‌ రూమ్‌ లను గుర్తించి పోలీసు శాఖ సమన్వయంతో తగిన పోలీసు రక్షణ ఏర్పాటు, జిల్లా కలెక్టర్లు సంబంధిత శాఖ అధికారులతో సమావేశం నిర్వహించాలని, పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు, పారిశుధ్యం తదితర ఏర్పాట్లు చేయాలన్నారు. స్ట్రాంగ్ రూమ్ ఇంచార్జ్‌ లు, రూట్ ఆఫీసర్లు, లైజన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ లైజన్ ఆఫీసర్లు మరియు చీఫ్ సూపరింటెండెంట్లు టీఎస్‌పీఎస్‌సీ ఇచ్చిన చెక్ లిస్ట్ ప్రకారం సూచనలను పాటించాలని అన్నారు. టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూం కూడా ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా కేంద్రాలలో అక్టోబర్ 16, 2022 ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 1.00 గంటల వరకు జరగాల్సిన ప్రిలిమినరీ టెస్ట్ (ఆబ్జెక్టివ్ టైప్) కోసం అభ్యర్థులు వారి హాల్ టిక్కెట్‌లను టీఎస్‌పీఎస్‌సీ కమిషన్ వెబ్‌సైట్ https://www.tspsc.gov.in ద్వారా డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు.

ఈ పరీక్షల కోసం తొలిసారిగా ప్రవేశపెట్టిన బయోమెట్రిక్ ఫీచర్‌పై అభ్యర్థులకు అవగాహన కల్పించేందుకు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయాలని సీఎస్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అభ్యర్థులు కూడా హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని మరియు చివరి నిమిషంలో ఆలస్యం జరగకుండా ఉండేందుకు నిర్ణీత సమయానికి ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని వారికి తెలిపాలన్నారు. ఈ టెలికాన్ఫరెన్స్‌ లో టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్, జీఏడీ సెక్రటరీ శేషాద్రి, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − 13 =