కూట‌మి పంచాయితీలపై నేడు తుది నిర్ణ‌యం?

Final Decision On Alliance Panchayats Today?, Alliance Panchayats Today, Alliance Panchayats, Alliance, AP State, Elections, Nomination, Final Decision On Alliance, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
AP state , Elections , nomination ,Final decision on alliance panchayats today?

ఓ ప‌క్క ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో నామినేష‌న్ల ప‌ర్వం మొద‌లైంది. వైసీపీ, బీజేపీకి చెందిన అభ్య‌ర్థులు నామినేష‌న్ల దాఖ‌లు చేస్తున్నారు. కూట‌మి నుంచి బాల‌కృష్ణ‌, నారా లోకేశ్ వంటి నేత‌లు కూడా నామినేష‌న్లు దాఖ‌లు చేశారు. ఎన్నిక‌ల ప‌ర్వం జోరందుకుంటున్న‌ప్ప‌టికీ.. ఇంకా కొన్నిచోట్ల కూట‌మిలో పంచాయితీలు కొన‌సాగుతున్నాయి. కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌లో అభ్య‌ర్థుల‌పై స్ప‌ష్ట‌త రాలేదు. ఉండి, అన‌ప‌ర్తి, దెందులూరు, పాడేరు వంటి నియోజ‌క‌వ‌ర్గాల‌లో ఇంకా డైల‌మా కొన‌సాగుతోంది. సీట్ల సర్దుబాటుకు సంబంధించి అధినేత చంద్రబాబు ఇప్ప‌టికే ప‌లుమార్లు సమీక్షలు నిర్వహించారు. కూటమి నేత‌ల‌తోను చ‌ర్చ‌లు జ‌రిపారు. కానీ.. అధికారికంగా కొన్ని స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేయాల్సి ఉంది.

తెలుగుదేశంలో చేరిన రఘురామకృష్ణరాజు సీటు వ్య‌వ‌హారంపై అధికారికంగా ఇంకా ఎటువంటి నిర్ణ‌య‌మూ వెలువ‌డ‌లేదు. నరసాపురం పార్లమెంట్ పరిధిలో సీటు సర్దుబాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఏలూరు పార్లమెంటులో మరో సీటు సర్దుబాటు కాదని జిల్లా నేతలు అభిప్రాయపడుతున్నారు. అనపర్తికి బదులు బీజేపీకి మరో సీటు సర్దుబాటుపై చంద్రబాబు కూటమి నేతలతో చర్చిస్తున్నట్లు సమాచారం. చంద్రబాబు ఆఖరి నిమిషంలో రెండు సీట్ల విషయంలో బీజేపీతో సర్దుబాట్లపై దృష్టి పెట్టారు. అనపర్తి సీటును స్థానిక టీడీపీ నేత రామకృష్ణారెడ్డి ఎట్టి పరిస్థితుల్లో వదులుకునేది లేదని, తానే పోటీ చేస్తానని పట్టుబట్టారు. బీజేపీకి అక్కడ సహకరించడం కూడా లేదు. అక్కడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పురంధేశ్వరి కూడా ఆ సీటును మార్చడానికి ఒప్పుకున్నారు.

అయితే దాని బ‌దులుగా ఏలూరు పార్లమెంటులో ఒక స్థానాన్ని వారు బలంగా కోరుతున్నారు. ఈ నేపథ్యంలో సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఉండి నియోజకవర్గాన్ని రఘురామకు ఇవ్వాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం. ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుని మరోసారి అభ్యర్థిగా ప్రకటించేశారు. అయితే, ఆయన కూడా సీటు వదులుకోవడానికి ససేమిరా అంటున్నారు. చంద్రబాబు వారితోనూ మాట్లాడారు. నరసాపురం పార్లమెంట్ పరిధిలో జిల్లా అధ్యక్ష బాధ్యతలు రామరాజుకి అప్పగించే విధంగా, ప్రస్తుతం అక్కడ జిల్లా అధ్యక్షురాలిగా ఉన్న సీతారామలక్ష్మికి పొలిట్ బ్యూరోలో తీసుకుని పార్టీ పదవులు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు వారికి సందేశాన్ని పంపారు. ఉండిలో ఆర్ఆర్ఆర్ కు లైన్ క్లియర్ అయిందని చెప్పుకోవచ్చు. అనపర్తి స్థానానికి బదులు ఏలూరు పార్లమెంటులో ఒక స్థానం కావాలని బీజేపీ అధిష్టాన వర్గం కోరుతోంది. రేపో, మాపో అభ్య‌ర్థుల‌కు బీ ఫారాలు ఇవ్వ‌నుండ‌డంతో ఆయా స్థానాల‌ను ఈలోపే తేల్చేయ‌నున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × five =