రాష్ట్రంలో సమగ్ర భూ సర్వే జనవరి 1 నుంచి ప్రారంభం: ఏపీ సీఎం వైఎస్ జగన్

Andhra Pradesh, AP CM YS Jagan, AP Government, AP Government To Start Pilot Project Over Land Survey, AP Political Updates, Land Survey Pilot Project, Land Survey Pilot Project of AP, Pilot project, Pilot Project Over Land Survey, YS Jagan Reviewed Land Survey Pilot Project

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్టు 31, సోమవారం నాడు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టబోయే భూ సర్వే పైలెట్‌ ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష కార్యక్రమంలో డిప్యూటీ సీఎం, రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, జనవరి 1, 2021 నుంచి రాష్ట్రంలో సమగ్ర భూ సర్వే చెప్పట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ పక్రియను ఆగస్టు, 2023 నాటికి పూర్తి చేయాలని సూచించారు.

సమగ్ర భూ సర్వే సమయంలో వివాదాల పరిష్కారానికి ముందుగానే మొబైల్‌ ట్రిబ్యునల్స్‌ ఏర్పాటు చేసి, అక్కడికక్కడే వివాదాలను పరిష్కరించాలని చెప్పారు. ప్రజలకు ఈ సర్వేపై గ్రామ సభల ద్వారా అవగాహన కల్పించాలన్నారు. అర్బన్‌ ప్రాంతాల్లో కూడా సర్వే చేపట్టాలని చెప్పారు. సమగ్ర భూ సర్వేలో పాల్గొనే సర్వేయర్లకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ ఇవ్వాలని అధికారులకు సూచించారు. సర్వే నేపథ్యంలో డ్రోన్లు, రోవర్లు, సర్వే రాళ్లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − nine =