ఏపీలో వైసీపీ ఓటమి ఖయమేనా?

Family Stroke For YS Jagan..., Family Stroke, Stroke For YS Jagan, Andhra Pradesh Assembly Elections 2024, Assembly Elections 2024, Janasena, TDP, BJP, YS Sharmila, YS Sunitha, Vijayamma, Avinash Reddy, Congress Party, AP Political News, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
Andhra Pradesh Assembly Elections 2024,Assembly Elections 2024, Janasena,TDP, BJP,YS Sharmila, YS Sunitha, Vijayamma, Avinash Reddy, Congress Party

ఏపీలో జరుగబోయే  ఎన్నికలు సీఎం జగన్‌కు అంత ఈజీ కాదని రాజకీయ విశ్లేషకులతో పాటు ఎన్నికల సర్వేలు కూడా చెబుతున్నాయి. ప్రత్యర్థి పార్టీల సంగతేమో గానీ కుటుంబసభ్యులే జగన్‌కు పక్కలో బల్లెంలా మారడం జగన్ కు పెద్ద తలనొప్పిగా మారింది. ఇప్పటికే చెల్లి షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి ఇంటిగుట్టు రట్టు చేస్తుండగా..వైఎస్ భారతి వ్యవహారం  ఆయన ముందు మరో గండంగా నిలబడింది.

నిజానికి  వైఎస్ భారతి రాజకీయాలకు దూరంగానే ఉంటారని అంతా అనుకుంటారు.కానీ  భర్త ఏపీ సీఎం కావడం, పుట్టింటివారు కూడా వైసీపీలో ఉండటంతో భారతి పేరు తరచుగా రాజకీయాల్లో వినిపిస్తూనే ఉంటుంది.  తన పుట్టింటివారికి కీలక  పదవులు ఇప్పించుకోవడంలోనూ, ప్రత్యక్ష రాజకీయాలలో లేకపోయినా.. జగన్ వేసే ప్రతి అడుగు భారతి తెర వెనుక నడిపిస్తుందన్న టాక్ మాత్రం బాగానే ఉంది.

వైఎస్ వివేకానందరెడ్డి గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు  దారుణ హత్యకు గురవడం అప్పట్లో పెద్ద సెన్సేషన్ అయింది. అయితే ఈ హత్య వెనక వైఎస్ భారతి పాత్ర ఉందన్న ప్రచారం అంతంతమాత్రంగా వినిపించేది. కానీ వివేకం సినిమా ఇందులో భారతి పాత్ర ఉందని కుండబద్దలు కొట్టినట్లు చెప్పడంతో ఈ ప్రచారం మరింత జోరందుకుంది.  అవినాష్ రెడ్డికి ఎంపీ సీటు దక్కకుండా వివేకానంద రెడ్డి అడ్డుపడుతున్నారనే  ఆయనను హత్య చేసారని.. ఈ హత్య గురించి భారతికి ముందుగానే తెలుసు అన్నది చాలామంది వాదన.

తన తండ్రి వైఎస్ వివేకాను దారుణంగా హత్య చేసిన వారికి అన్నయ్య వైఎస్ జగన్ అండగా నిలిచారంటూ  వైఎస్ సునీత ఆరోపిస్తున్నారు. భారతి ఒత్తిడితోనే అవినాష్  రెడ్డిని జగన్ కాపాడుతున్నారని ఆమె ఆరోపణ.  జగనన్నకు ఓటేయొద్దని కోరుతున్న  సునీత ..ఆమె చెల్లి  వైఎస్ షర్మిలకు సపోర్ట్ చేస్తున్నారు. వైఎస్ భారతిపై జరుగుతున్న ప్రచారం జగన్‌పై  ప్రభావం చూపుతుందని  విశ్లేషకులు చెబుతున్నారు.

దీనినే ఆయుధంగా మలుచుకున్న విపక్షాలు.. సొంత చెల్లికి న్యాయం చేయలేనివాడు ప్రజలకు ఏం చేస్తాడంటూ ప్రశ్నిస్తున్నారు. ఇటు వైఎస్ షర్మిల, వైఎస్ సునీత ఇద్దరూ కూడా తమ  అన్న వైఎస్ జగన్ కు గెలిపించవద్దని కోరుతున్నారు. ఇటు వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నా కూడా మళ్లీ  కడప లోక్ సభలో అవినాష్‌నే జగన్ తమ అభ్యర్థిగా నిలిపారు. దీంతో అవినాష్ రెడ్డికి పోటీగా  వైఎస్ షర్మిల సిద్దమయ్యారు.మొత్తంగా ఈ ఎన్నికలు జగన్ కు పెద్ద సవాల్ ను విసిరినట్లే అవుతందన్న వార్తలు వినిపిస్తున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − 1 =