ఆగస్ట్ లో బిజీ బిజీగా సీఎం జగన్

CM YS Jagan Schedule In August Month,CM YS Jagan,AP CM YS Jagan,AP Latest News,AP Politics,AP Political News,AP Political Updates,YCP Latest News,YSRCP,TDP,Mango News Telugu,YS Jagan Mohan Reddy,CM YS Jagan Schedule In August,YS Jagan Schedule In August Month,YS Jagan Schedule In August,YS Jagan Latest News

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్ట్ 1వ తేదీన తన కుటుంబంతో కలిసి జెరూసలేం వెళ్తున్నారు, నాలుగు రోజుల జెరూసలేం పర్యటన అనంతరం ఆగస్టు 5వ తేదీన హైదరాబాద్ చేరుకోనున్నారు. పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్ట్ 6,7 తేదీలలో ఢిల్లీ వెళ్లనున్నారు. 2 రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీని కలిసి రాష్ట్రం ఎదురుకుంటున్న సమస్యలు, గతం నుంచి పెండింగ్లో ఉన్న అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లడంతో పాటు,రాష్ట్రానికి అవసరాలకనుగుణంగా తక్షణ ఆర్థిక సహాయం కోరనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రధాని మోడీతో పాటు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, హోంశాఖ మంత్రి అమిత్‌ షాలను కలిసి రాష్ట్ర సమస్యలను చర్చించనున్నారు. వీరితోపాటు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడులను కూడా సీఎం వైఎస్‌ జగన్‌ కలిసే అవకాశం ఉన్నట్టు సమాచారం.

ఢిల్లీ పర్యటన అనంతరం పులివెందుల చేరుకొని కదిరి రింగ్ రోడ్డులో దివంగత వై.ఎస్ వివేకానంద రెడ్డి విగ్రహ ఆవిష్కరణ చేయనున్నారు, మరుసటి రోజు కియా మోటార్స్ ప్లాంట్ సందర్శించి అక్కడ తయారైన కొత్త కారును ఆవిష్కరించనున్నారు. ఆగస్ట్ 9 తేదీన విజయవాడలో పారిశ్రామిక సదస్సులో పాల్గొంటారు, దాదాపు 40 దేశాల నుంచి వచ్చే పారిశ్రామిక వేత్తలతో పెట్టుబడుల గురించి సీఎం జగన్ చర్చించనున్నారు. మళ్ళీ ఆగస్ట్ 16 తేదీన జగన్ మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు, డల్లాస్ లో 5 రోజుల పాటు పర్యటించనున్నారు.  17న డల్లాస్ లో జరిగే ప్రవాస భారతీయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొంటారు. ఇలా వరుస కార్యక్రమాలతో ఆగస్ట్ నెలలో సీఎం జగన్ బిజీ బిజీగా గడపనున్నారు.

 

Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here