లాడెన్ వారసుడు హమ్జా బిన్ లాడెన్ హతం?

Afghanistan, Al Qaeda, As Per Reports, Hamza Bin Laden, Hamza Bin Laden Died, Hamza Bin Laden Is Dead, Hamza bin Laden’s death, Iraq, Mango News Telugu, NBC News, Osama Bin Laden, Osama Bin Laden Son, Osama Bin Laden Son Hamza Dead, Osama Bin Laden’s Son And Heir Hamza Dead, Saudi Arabia, Somali, Syria, terrorist group Al Qaeda, United Nations Security Council, USA Officials Say Hamza Bin Laden Is Dead

అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ మాజీ నాయకుడు ఒసామా బిన్ లాడెన్ కుమారుడు హమ్జా బిన్ లాడెన్ చనిపోయినట్లు అమెరికాలో మీడియా కధనం వెలుగులోకి వచ్చింది. గతంలో ఒసామా బిన్ లాడెన్ ను వెతికిపట్టుకొని హతమార్చిన అమెరికా, అతని తరువాత వారసుడిగా అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ పగ్గాలు చేపట్టిన హమ్జా బిన్ లాడెన్ ను కూడ మట్టుబెట్టినట్టు ప్రచారం జరుగుతుంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆధారంగా జూలై 31 న ఒక అమెరికా మీడియా సంస్థ మరణాన్ని నివేదించిన తరువాత ఈ వార్త వెలుగులోకి వచ్చింది. ముగ్గురు అమెరికా అధికారులు ధృవీకరించారని, హమ్జా బిన్ లాడెన్ మరణం గురించి తమ వద్ద సమాచారం ఉన్నప్పటికీ, అతని మరణం గురించి తేదీ, సమయం మరియు వేదిక వంటి వివరాలను వారు వెల్లడించలేదు అని ఎన్‌బీసీ న్యూస్ వెల్లడించింది.

అయితే హమ్జా బిన్ లాడెన్ మృతిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎటువంటి సమాధానం ఇవ్వలేదు మరియు దీనిపై వ్యాఖ్యానించడం ఇష్టం లేదని ట్రంప్ తెలిపినట్టు సమాచారం. ఒసామా బిన్ లాడెన్ యొక్క 20 మంది పిల్లలలో హమ్జా 15వ వాడు, అతని వయసు 30 సంవత్సరాలు ఉంటుందని భావిస్తున్నారు. 2017లో హమ్జాను ఉగ్రవాదలిస్టులో పెట్టి, అతన్ని పట్టించిన వారికీ 1 మిలియన్ డాలర్ల బహుమతిని అమెరికా ప్రకటించింది. తన తండ్రి మరణానికి ప్రతీకారం తీసుకునేందుకు అతను సన్నద్ధమవుతున్నట్టు పలు నివేదికలు రావడంతోనే, అమెరికా అప్రమత్తమై తీవ్రంగా గాలించి హతమార్చినట్టు సమాచారం.

 

[subscribe]
[youtube_video videoid=nA4ZEgLnyLE]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 2 =