నేడు ‘జగనన్న వసతి దీవెన’ రెండో విడత నగదు బదిలీ, రూ.1,024 కోట్లు విడుదల చేయనున్న సీఎం జగన్

CM YS Jagan To Disburse second installment of Jagananna Vasathi Deevena Scheme in Nandyal Today, CM YS Jagan To Disburse second installment of Jagananna Vasathi Deevena Scheme, second installment of Jagananna Vasathi Deevena Scheme, YS Jagan Mohan Reddy To Disburse 2nd Installment Of Jagananna Vidya Deevena Scheme In Nandyal, 2nd Installment Of Jagananna Vidya Deevena Scheme, Jagananna Vasathi Deevena Scheme Funds, AP CM YS Jagan To Disburse second installment of Jagananna Vasathi Deevena Scheme in Nandyal, Jagananna Vasathi Deevena Scheme, Jagananna Vidya Deevena Scheme Latest News, Jagananna Vidya Deevena Scheme Latest Updates, Jagananna Vidya Deevena Scheme Live Updates, AP CM YS Jagan Mohan Reddy, Jagan Mohan Reddy, AP CM YS Jagan, YS Jagan Mohan Reddy, YS Jagan, CM YS Jagan, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన నంద్యాల జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ‘జగనన్న వసతి దీవెన’ రెండో విడత నగదు బదిలీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 10.68 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి నగదును జమ చేయనున్నారు. పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఆర్ధికంగా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వసతి దీవెన పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద విద్యార్థులకు భోజనంతో పాటు వసతి, రవాణా ఖర్చులను చెల్లిస్తుంది ప్రభుత్వం. ప్రతి ఏటా రెండు విడతల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్ చదివే వారికి రూ.20 వేల వంతున ప్రభుత్వం అందించనుంది. ఈ స్కీమ్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 10,68,150 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి సీఎం జగన్ రూ.1,024 కోట్లను బటన్ ప్రెస్ చేయటం ద్వారా జమ చేయనున్నారు. నంద్యాల జిల్లా ఏర్పాటు తర్వాత తొలిసారిగా సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు పొలిసు అధికారులు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − thirteen =