సెప్టెంబర్ 22న సీఎం వైఎస్ జగన్‌ కుప్పం పర్యటన, వైఎస్ఆర్ చేయూత మూడో విడత నిధుల విడుదల

CM YS Jagan will Visit Kuppam on SEP 22nd to Release YSR Cheyutha Scheme Third Phase Funds, CM YS Jagan will Visit Kuppam, YSR Cheyutha Scheme , YSR Cheyutha Scheme 3rd Phase Funds, YSR Cheyutha Scheme Application, Mango News, Mango News Telugu, AP Govt YSR Cheyutha Scheme , YSR Cheyutha Scheme, AP YSR Cheyutha Scheme, AP CM YS Jagan Mohan Reedy, YS Jagan YSR Cheyutha, AP CM YS Jagan Latest News And Updates, YSR Cheyutha News And Live Updates

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెప్టెంబర్ 22, గురువారం చిత్తూరు జిల్లాలోని కుప్పంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కుప్పంలో జరిగే బహిరంగ సభలో ‘వైఎస్ఆర్ చేయూత’ పథకం మూడో విడత నిధులను సీఎం వైఎస్ జగన్ విడుదల చేయనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన షెడ్యూల్ ఖరారైంది. గురువారం ఉదయం 9.15 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి సీఎం బయలుదేరి, 10.45 గంటలకు కుప్పం చేరుకుంటారు. 11.15-12.45 గంటల మధ్య బహిరంగ సభలో పాల్గొని వైఎస్ఆర్ చేయూత పథకం మూడో విడత నిధులను విడుదల చేస్తారు. ఇక 1.20 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 3.10 గంటలకు తాడేపల్లి నివాసానికి సీఎం వైఎస్ జగన్ చేరుకోనున్నారు.

వైఎస్ఆర్ చేయూత పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన 45–60 ఏళ్లలోపు అర్హత గల మహిళలకు ఏపీ ప్రభుత్వం చేయూతను అందిస్తుంది. ఈ పథకం ద్వారా ఎంపిక చేసిన మహిళలకు ప్రతి సంవత్సరం రూ.18,750 చొప్పున నాలుగు సంవత్సరాల్లో మొత్తంగా రూ.75 వేలు అందజేయనున్నారు. ఇప్పటికే రెండో విడతల్లో రాష్ట్రంలో అర్హులైన మహిళలకు రూ.37500 నగదును అందించగా, గురువారం మూడో విడత కింద మరో రూ.18,750 నగదును వారి ఖాతాల్లో జమ చేయనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here