ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేల నిరసన, వరుసగా నాలుగోరోజు సభ నుంచి సస్పెన్షన్

Speaker Tammineni Sitaram Suspends TDP Legislators From AP Assembly For One Day, AP Assembly Session Speaker Tammineni Sitaram , AP Assembly Session Speaker, Speaker Tammineni Sitaram, Tammineni Sitaram,Tammineni Sitaram Suspends TDP Legislators , Suspends TDP Legislators For 1 Day, Mango News, Mango News Telugu, AP Assembly Calendar , Monsoon Session of AP Legislature, Andhra Pradesh Legislative Assembly Sep15th, Monsoon Session, AP Assembly Session Latest News And Updates, YSR Congerss Paty, TDP Party, BJP Party, Janasena Party

మంగళవారం తెలుగుదేశం పార్టీ (టీడీపీ) సభ్యులను సభ సుంచి స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. శాసన సభలో ప్రశ్నోత్తరాలు ఆర్డర్ ప్రకారం జరుగకపోవడంపై టీడీపీ ఎమ్మెల్యేలు అభ్యంతరం తెలిపారు. సభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని క్రమపద్ధతిలో నిర్వహించాలంటూ స్పీకర్‌ను డిమాండ్ చేశారు. మద్యం ,లేపాక్షి భూములు వంటి కీలక అంశాలపై సభలో చర్చ జరగకపోవడంపై స్పీకర్ వద్ద వారు నిరసన తెలిపారు. కాగా మంగళవారం సభలో కీలక పరిణామం చోటుచేసుకుంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పెగాసెస్‌ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల నాయకుల ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హౌస్ కమిటీ నేడు మధ్యంతర నివేదికను సభ ముందుంచింది. కమిటీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి ఈ నివేదికను స్పీకర్‌ తమ్మినేని సీతారాంకు అందజేశారు.

ఈ నేపథ్యంలో దీనిపై ఈరోజు అసెంబ్లీలో చర్చ చేపట్టనుంది ప్రభుత్వం. అయితే ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సభను నిర్వహించాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. స్పీకర్ టీడీపీ సభ్యులను తమ ఆందోళన విరమించి ఎవరి సీట్లలో వారు కూర్చోవాలని పదే పదే కోరారు. అయినా టీడీపీ సభ్యులు నినాదాలు కొనసాగిస్తుండటంతో స్పీకర్ తమ్మినేని సీతారాం వారిని ఒకరోజు పాటు సభ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో టీడీపీ సభ్యులు వరుసగా నాలుగో రోజు సభ నుంచి సస్పెండ్ అయ్యారు. అయితే దీనిపై అధికారపక్ష సభ్యులు స్పందిస్తూ.. బీఏసీ సమావేశంలో అంగీకరించిన అంశాలపై చర్చను టీడీపీ సభ్యులు అడ్డుకుంటున్నారని, వారు సభను అడ్డుకునేందుకే అసెంబ్లీకి వస్తున్నారని మండిపడ్డారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here