కరోనా కేసులు పెరుగుతుండడంతో ఆ జిల్లాలో 24 గంటల కర్ఫ్యూ

24 Hour Curfew Will Implement Across East Godavari District, Andhra Pradesh, AP Coronavirus, AP COVID 19 Cases, Corona Outbreak, Coronavirus, curfew in andhra pradesh, Curfew in East Godavari district, east godavari, East Godavari District Curfew

ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా జూలై 18 నాటికీ రాష్ట్రంలో కర్నూల్ జిల్లా(5681) తర్వాత, అత్యధికంగా తూర్పుగోదావరిలో జిల్లాలో 5499 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. క‌రోనా కేసులు ఎక్కువుగా నమోదవుతున్న నేప‌థ్యంలో తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 24 గంట‌ల పాటు క‌ర్ఫ్యూ అమ‌లు చేయాలనీ క‌లెక్టర్ మురళీధర్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. జూలై 19, ఆదివారం నాడు ఉ.6 గంటల నుండి జూలై 20, సోమవారం నాడు ఉ.6 గంటల వరకు జిల్లా అంతటా కర్ఫ్యూ విధిస్తున్న‌ట్లుగా ప్రకటించారు.

కేవలం అత్య‌వ‌స‌ర వైద్య‌సేవ‌లు, మెడిక‌ల్ షాపుల‌కు మాత్రమే ఈ కర్ఫ్యూ నుండి మినహాయింపు ఉంటుందని, మిగ‌తా అన్నిదుకాణాలు, సేవలను మూసివేయాల‌ని సూచించారు. కర్ఫ్యూ నిబంధ‌న‌లు పాటించ‌కుండా ఎవ‌రైనా రోడ్ల మీదకి వస్తే కేసులు నమోదు చేస్తామ‌ని హెచ్చరించారు. జిల్లాలో నమోదైన 5499 కేసుల్లో 1251 మంది కోలుకుని డిశ్చార్జ్ అవగా, 4202 మంది చికిత్స పొందుతున్నారు. మరోవైపు కరోనా కారణంగా జిల్లాలో ఇప్పటివరకు 46 మంది మరణించారు.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − thirteen =