డ్రాగన్ కంట్రీ కన్నింగ్ ప్లాన్.. భారత ఎన్నికల్లో జోక్యానికి ప్రయత్నాలు

China May Misuse AI To Target Elections In India Says Microsoft, China May Misuse AI, China Target Elections In India, Microsoft Says China May Misuse AI, AI, China, India, Lok Sabha Elections, Microsoft, Satya Nadella, Bill Gates, Indian Political News, Political News, Mango News, Mango News
China May Misuse AI To Target Elections In India Says Microsoft, China May Misuse AI, China Target Elections In India, Microsoft Says China May Misuse AI, AI, China, India, Lok Sabha Elections, Microsoft, Satya Nadella, Bill Gates, Indian Political News, Political News, Mango News, Mango News

భారత్ విషయంలో ఎప్పుడూ వక్రబుద్ధిని చూపిస్తుంటుంది డ్రాగన్ కంట్రీ చైనా. నిత్యం కయ్యానికి కాలు దువ్వుతుంటుంది. ఇప్పటికే సరిహద్దుల విషయంలో భారత్-చైనా మధ్య వైరం కొనసాగుతోంది. త్వరలో భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ భారీ కుట్రకు డ్రాగన్ కంట్రీ తెరలేపింది. ఎన్నికల్లో జోక్యం చేసుకొని అవాంతరాలు సృష్టించేందుకు దొంగ చాటున ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను ఆయుధంగా వాడుకుంటోంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంచలన ప్రకటన చేసింది.

త్వరలో ప్రపంచవ్యాప్తంగా 64 దేశాల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఆయా దేశాల్లో కొత్త ప్రభుత్వాలు కొలువుదీరనున్నాయి. ఈ సమయంలో చైనా ఈ కుట్రకు తెరలేపడం సంచలనంగా మారింది. చైనా ఎత్తుగడలను ముందే మైక్రోసాఫ్ట్ థ్రెట్ ఇంటెలిజెన్స్ బృందం పసిగట్టింది. ఈ మేరకు హెచ్చరికలు జారీ చేసింది. భారత్, అమెరికా, దక్షిణ కొరియా సహా పలు దేశాల ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకునేందుకు చైనా ప్రభుత్వ మద్ధతు ఉన్న సైబర్ గ్రూపులు ప్రయత్నాలు చేస్తున్నాయని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది.

ఎన్నికలు జరగనున్న దేశాల్లో ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసేందుకు.. ఓటర్ల మధ్య పలు అంశాల్లో విభజన తీసుకొచ్చేందుకు చైనా ప్రయత్నిస్తోందని మైక్రోసాఫ్ట్ పేర్కొంది. ఇందుకోసం సోషల్ మీడియా వేదికగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటెడ్ కంటెంట్‌ను ఉపయోగించనుందని తెలిపింది. ముఖ్యంగా అమెరికా అధ్యక్ష ఎన్నికలను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలను చైనా వాడుతోందని పేర్కొంది. త్వరలో 64 దేశాల్లో ఎన్నికలు జరగనుండగా.. చైనా చేసిన ఈ ప్రకటన ఆందోళనకరంగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 2 =