తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో కోవిడ్-19 (కరోనా వైరస్) రోజురోజుకి క్రమంగా విజృంభిస్తుంది. మార్చ్ 25, బుధవారం నాటికీ తెలంగాణ రాష్ట్రంలో 41 కరోనా పాజిటివ్ కేసుల నమోదవ్వగా, ఆంధ్రప్రదేశ్ లో కరోనా సోకిన వారి సంఖ్య 10కి చేరింది. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో పాటుగా పలు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా పై పోరాటం చేసేందుకు ప్రభుత్వాల ప్రయత్నానికి పలువురు ప్రముఖులు సహకారం అందిస్తూ సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు అందిస్తున్నారు.
ఈ నేపథ్యంలో కరోనా వైరస్ నివారణ చర్యల కోసం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మార్చ్ 26, గురువారం నాడు ప్రధాన మంత్రి సహాయనిధికి కోటి రూపాయలతో పాటుగా తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా కోటి రూపాయలు విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50 లక్షలు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50 లక్షలు చొప్పున విరాళం అందజేస్తానని పవన్ కల్యాణ్ తన అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించారు.
మరో వైపు తన బాబాయ్ పవన్ కళ్యాణ్ స్పూర్తితో కేంద్ర ప్రభుత్వం, రెండు తెలుగు రాష్ట్రాల సహాయనిధిలకు తనవంతు సాయంగా రూ.70 లక్షల విరాళం అందిస్తున్నట్టు రామ్ చరణ్ ప్రకటించారు. చాలాకాలం తర్వాత మరోసారి ట్విట్టర్ లో ఖాతా తెరుస్తూ ఈ మేరకు ప్రకటన చేశారు. ఇప్పటికే హీరో నితిన్ కూడా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.10 లక్షల చొప్పున ప్రకటించారు. అలాగే దర్శకుడు వి.వి.వినాయక్ పేద కళాకారులకు తన వంతు సాయంగా రూ.5 లక్షలను విరాళంగా ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో పలువురు ఎంపీలు, ఇతర స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కరోనాపై పోరుకు ప్రభుత్వానికి సహకరిస్తూ భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు.
I will be donating Rs.1 crore to PM relief fund to support our https://t.co/83OmZ9biYX Sri @narendramodi ji,in turbulent times like this. His exemplary and inspiring leadership would truly bring our country from this Corona pandemic.
— Pawan Kalyan (@PawanKalyan) March 26, 2020
I will be donating Rs.50 Lakhs each to both AP and Telangana CM relief funds to fight against Corona pandemic.
— Pawan Kalyan (@PawanKalyan) March 26, 2020
Hope this tweet finds you in good health. At this hour of crisis, inspired by @PawanKalyan garu, I want to do my bit by contributing to aid the laudable efforts of our governments…
Hope you all are staying safe at home! @TelanganaCMO @AndhraPradeshCM @PMOIndia @KTRTRS pic.twitter.com/Axnx79gTnI— Ram Charan (@AlwaysRamCharan) March 26, 2020
My wholehearted gratitude to
Sri Ram Charan @AlwaysRamCharan for
donating Rs. 70 lakhs to fight against Corona Pandemic. https://t.co/1aIuLIgk7N— Pawan Kalyan (@PawanKalyan) March 26, 2020
ఈ అంశానికి సంబంధించిన మరికొన్ని వార్తలు:
కరోనా వైరస్ వ్యాప్తిపై అప్రమత్తంగా ఉండాలి – పవన్ కళ్యాణ్
కరోనా ఎఫెక్ట్: తన పుట్టిన రోజు వేడుకలు జరపవద్దన్న రామ్ చరణ్
కరోనా ఎఫెక్ట్: మార్చ్ 19 నుంచి చిలుకూరు బాలాజీ టెంపుల్ మూసివేత
కరోనా ఎఫెక్ట్: షిరిడీ ఆలయం, తాజ్ మహల్ మూసివేత
కరోనా ఎఫెక్ట్: రైల్వే ప్లాట్‌ఫామ్ టికెట్ ధర పెంపు
దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ కు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం
కరోనా వైరస్ ముప్పు – కరోనా వైరస్ లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు
కరోనా అలర్ట్: పోస్టర్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
[subscribe]