కరోనాపై పోరాటానికి పవన్ కళ్యాణ్ రూ. 2 కోట్ల విరాళం

CMRF, Corona Deaths, Coronavirus, Coronavirus Fight, Coronavirus Latest News, Coronavirus Live Updates, Coronavirus Outbreak India, Coronavirus Symptoms, Coronavirus Updates, COVID 19 Cases India, COVID 19 Lockdown, COVID-19, COVID-19 News, pawan kalyan, pawan kalyan coronavirus, pawan kalyan coronavirus donatons, Pawan Kalyan donates, pawan kalyan donates 1cr, Pawan Kalyan donates 2 crore, Search Results Web results Coronavirus outbreak

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో కోవిడ్-19 (కరోనా వైరస్) రోజురోజుకి క్రమంగా విజృంభిస్తుంది. మార్చ్ 25, బుధవారం నాటికీ తెలంగాణ రాష్ట్రంలో 41 కరోనా పాజిటివ్‌ కేసుల నమోదవ్వగా, ఆంధ్రప్రదేశ్ లో కరోనా సోకిన వారి సంఖ్య 10కి చేరింది. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో పాటుగా పలు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా పై పోరాటం చేసేందుకు ప్రభుత్వాల ప్రయత్నానికి పలువురు ప్రముఖులు సహకారం అందిస్తూ సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు అందిస్తున్నారు.

ఈ నేపథ్యంలో కరోనా వైరస్ నివారణ చర్యల కోసం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ మార్చ్ 26, గురువారం నాడు ప్రధాన మంత్రి సహాయనిధికి కోటి రూపాయలతో పాటుగా తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా కోటి రూపాయలు విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50 లక్షలు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50 లక్షలు చొప్పున విరాళం అందజేస్తానని పవన్‌ కల్యాణ్‌ తన అధికారిక ట్విటర్‌ ఖాతా ద్వారా వెల్లడించారు.

మరో వైపు తన బాబాయ్ పవన్ కళ్యాణ్ స్పూర్తితో కేంద్ర ప్రభుత్వం, రెండు తెలుగు రాష్ట్రాల సహాయనిధిలకు తనవంతు సాయంగా రూ.70 లక్షల విరాళం అందిస్తున్నట్టు రామ్ చరణ్ ప్రకటించారు. చాలాకాలం తర్వాత మరోసారి ట్విట్టర్ లో ఖాతా తెరుస్తూ ఈ మేరకు ప్రకటన చేశారు. ఇప్పటికే హీరో నితిన్ కూడా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.10 లక్షల చొప్పున ప్రకటించారు. అలాగే దర్శకుడు వి.వి.వినాయక్‌ పేద కళాకారులకు తన వంతు సాయంగా రూ.5 లక్షలను విరాళంగా ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో పలువురు ఎంపీలు, ఇతర స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కరోనాపై పోరుకు ప్రభుత్వానికి సహకరిస్తూ భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు.

ఈ అంశానికి సంబంధించిన మరికొన్ని వార్తలు:

కరోనా వైరస్ వ్యాప్తిపై అప్రమత్తంగా ఉండాలి – పవన్ కళ్యాణ్

కరోనా ఎఫెక్ట్: తన పుట్టిన రోజు వేడుకలు జరపవద్దన్న రామ్ చరణ్

కరోనా ఎఫెక్ట్: మార్చ్ 19 నుంచి చిలుకూరు బాలాజీ టెంపుల్ మూసివేత

కరోనా ఎఫెక్ట్: షిరిడీ ఆలయం, తాజ్‌ మహల్ మూసివేత

కరోనా ఎఫెక్ట్: రైల్వే ప్లాట్‌ఫామ్ టికెట్ ధర పెంపు

దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ కు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం

కరోనా వైరస్ ముప్పు – కరోనా వైరస్ లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కరోనా అలర్ట్‌: పోస్టర్‌ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − 4 =