కరోనా వైరస్ ముప్పు – కరోనా వైరస్ లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Coronavirus Common Symptoms,Coronavirus Causes,Coronavirus Required Precautions,Coronavirus Cases, Coronavirus Latest updates,coronavirus common virus,Coronaviruses Symptoms,Coronavirus Treatments,Coronavirus Update,Coronavirus Latest News,Covid, Covid-19, Corona Virus In India, Corona Virus Effect In Telangana

కరోనా వైరస్‌ వ్యాధి లక్షణాలు:

 • దగ్గు, ముక్కు కారుతూనే ఉండడం
 • జ్వరం, తలనొప్పి
 • న్యుమోనియా, శ్వాస ఆడకపోవడం
 • వాంతులు, డయేరియా
 • వ్యాధి తీవ్రత పెరిగితే తీవ్రమైన న్యుమోనియా, రెనాల్ (కిడ్నీ ఫెయిల్యూర్) తో మనిషి మరణించే అవకాశం


కరోనా వైరస్‌ వ్యాపించే విధానం:

 • సాధారణంగా ఒక మనిషి నుండి మరో మనిషికి ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది
 • వ్యాధి సోకినా వ్యక్తి తుమ్మినా, దగ్గినా తుంపరల వలన పక్క వారికి సోకే అవకాశం
 • వ్యాధి సోకినా వారిని స్పర్శించిన, షేక్ హ్యాండ్ తీసుకున్నా ఇతరులకు వచ్చే ప్రమాదం
 • వ్యాధి సోకినా వ్యక్తి ముట్టుకున్నా వస్తువులను ముట్టుకున్నా, చేతులు శుభ్రం చేసుకోకుండా శరీర భాగాలను తాకినా వైరస్ సోకుతుంది

కరోనా వైరస్‌ వ్యాపించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

 • దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు చేతి రుమాలు అడ్డంగా పెట్టుకోవాలి
 • జనసమూహం ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వీలైనంత వరకు వెళ్లకుండా ఉండాలి, ఒకవేళ వెళ్లినా మాస్క్‌ ధరించాలి
 • చుట్టుపక్కల పరిశుభ్రతతో పాటుగా వ్యక్తిగత శుభ్రతను పెంపొందించుకోవాలి
 • పెంపుడు జంతువులకు దూరంగా ఉండడమే మంచిది
 • జలుబు, దగ్గు, జ్వరంతో మొదలై శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగిన, చాతిలో నొప్పి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలి
 • ముఖ్యంగా గర్భవతులు, బాలింతలు, పిల్లలు, 50 సంవత్సరాలు పైబడిన వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.


కరోనా వైరస్ సోకకుండా ఉండడానికి చేయాల్సిన పనులు:

 • వ్యక్తిగత శుభ్రతతో పాటు చుట్టుపక్కల పరిశుభ్రత పాటించడం
 • చేతులను తరుచుగా సబ్బుతో గాని శానిటైజర్ తోగాని కడుక్కోవాలి
 • తుమ్మే తప్పుడు లేదా దగ్గేటప్పుడు రుమాలుతో లేదా మోచేతి భాగంతో కవర్ చేసుకోవాలి
 • వాడేసిన టిస్యూలను, మాస్క్ లను వెంటనే చెత్తబుట్టలో పడేయాలి
 • అనారోగ్యంగా ఉన్నట్లు అనిపిస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో చేయకూడని పనులు:

 • తీవ్ర జలుబు, లేదా దగ్గుతో బాధపడుతుంటే ఇతరులతో కలవకుండా, ప్రత్యేకంగా ఉంటూ చికిత్స తీసుకోవాలి
 • బహిరంగ ప్రదేశాల్లో ఉమ్ము వేయకూడదు
 • పెంపుడు జంతువులకు కొంచెం దూరంగా ఉండాలి
 • ఉడకని లేదా పచ్చి మాంసాన్ని తినకూడదు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here