టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టు

Andhra Pradeesh ESI Scam, AP Breaking News, AP ESI Scam, AP Police Arrests Former Minister, ESI Scam, ESI Scam In AP, Police arrest Atchannaidu over ESI scam, Police arrest TDP MLA Atchannaidu, Former Andhra Pradesh minister, TDP MLA Atchannaidu Arrested in ESI Scam

టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని అవినీతి నిరోధకశాఖ(ఏసీబీ) అధికారులు ఈ రోజు ఉదయం అరెస్టు చేశారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలోని తన నివాసంలో ఆయన్ని అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు విజయవాడకు తరలించినట్టుగా సమాచారం. రాష్ట్రంలో వెలుగుచూసిన ఈఎస్‌ఐ కుంభకోణంలో అచ్చెన్నాయుడుపై వచ్చిన ఆరోపణలపై ఏసీబీ దర్యాప్తులో భాగంగా ఈ అరెస్ట్ జరిగినట్టు తెలుస్తుంది.

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అచ్చెన్నాయుడు కార్మికశాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ఈఎస్‌ఐ ఆసుపత్రుల్లో మందులు, వైద్య పరికరాల కొనుగోళ్లలో అక్రమాలు వెలుగుచూడడంతో వైసీపీ ప్రభుత్వం విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ దర్యాప్తుకు ఆదేశించింది. విచారణ అనంతరం ఈఎస్‌ఐకు సంబంధించి కొనుగోళ్లలో రూ.900 కోట్లకు పైగా భారీ అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కొన్నిరోజుల క్రితమే ఓ నివేదికను విడుదల చేసింది. పెద్ద ఎత్తున నకిలీ కొటేషన్లతో ఆర్డర్లు ఇచ్చినట్టు విజిలెన్స్‌ అధికారులు గుర్తించారు. విజిలెన్స్‌ నివేదిక ఆధారంగా ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో విచారణలో భాగంగా అచ్చెన్నాయుడు అరెస్ట్ చోటుచేసుకున్నట్టు తెలుస్తుంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 − one =