జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ఉప ముఖ్యమంత్రిపవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో రాష్ట్రంలోనే తొలి అత్యాధునిక ‘మోడల్ అంగన్‌వాడీ కేంద్రాన్ని’ మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, అపోలో హాస్పిటల్స్ వైస్ ఛైర్‌పర్సన్ ఉపాసన కామినేని కొణిదెల శుక్రవారం (నవంబర్ 20) ప్రారంభించారు.
ప్రముఖ టాలీవుడ్ నటుడు రామ్ చరణ్, ఉపాసన దంపతుల సహకారంతో అపోలో ఫౌండేషన్‌కు చెందిన ‘అపోలో ఆరంభ్’ చొరవతో పిఠాపురం అగ్రహారంలో ఈ కేంద్రాన్ని సుమారు రూ. 2 కోట్ల అంచనా వ్యయంతో అత్యంత సుందరంగా, ఆధునిక హంగులతో నిర్మించారు.
“బోర్న్ ఇన్ ఆంధ్రప్రదేశ్.. బిల్ట్ ఫర్ ఇండియాస్ మదర్స్ అండ్ చిల్డ్రన్” అనే నినాదంతో రూపుదిద్దుకున్న ఈ మోడల్ అంగన్‌వాడీ కేంద్రంలో గర్భిణులు, బాలింతలు మరియు చిన్నారుల ఆరోగ్యం, పౌష్టికాహారం, ప్రాథమిక విద్యపై ప్రత్యేక దృష్టి సారించారు. చిన్నారులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆధునిక విద్యాబోధన అందించేందుకు డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, సురక్షితమైన ఆట స్థలాలు, శుద్ధజలం మరియు మెరుగైన వైద్య సదుపాయాలను ఇందులో అందుబాటులోకి తీసుకువచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా అపోలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో 109 అంగన్‌వాడీ కేంద్రాలను అభివృద్ధి చేసేందుకు శ్రీకారం చుట్టగా, అందులో భాగంగా మొట్టమొదటి కేంద్రాన్ని పిఠాపురంలో ప్రారంభించడం విశేషం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మార్గదర్శకత్వంలో నియోజకవర్గంలోని పేద కుటుంబాలు, తల్లులు, చిన్నారుల సంక్షేమం కోసం కొణిదెల కుటుంబం తీసుకున్న ఈ చొరవ పట్ల స్థానికులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో స్మృతి ఇరానీ, ఉపాసన కొణిదెల అంగన్‌వాడీ కేంద్రంలోని వసతులను పరిశీలించి, అక్కడి చిన్నారులు, తల్లులతో ముచ్చటించారు. భవిష్యత్తులో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఇటువంటి మోడల్ అంగన్‌వాడీ కేంద్రాల ఏర్పాటుకు పిఠాపురం కేంద్రం ఒక ఆదర్శంగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు.