బస్ టికెట్లలో భారీ రాయితీ.. క్యాష్ బ్యాక్ ఆఫర్

Good news for AP voters, discount on bus tickets, Cash back offer, Abhi Bus, TSRTC
Good news for AP voters, discount on bus tickets, Cash back offer, Abhi Bus, TSRTC

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ , పార్లమెంటు ఎన్నికలు, తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు  మే 13న  జరగనున్నాయి. ఏపీలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 25 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. తెలంగాణలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో  ఎన్నికల సంఘంతో పాటు ప్రభుత్వాలు, పలు స్వచ్ఛంద సంస్థలు  ఓటర్లంతా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేయడానికి  అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఓటుహక్కును  ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలంటూ ఎన్నో  అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.

వ్యాపార సంస్థలు కూడా  కొన్ని ఆఫర్లు ప్రకటిస్తూ ప్రజాస్వామ్య పండుగలో ఓటర్లంతా పాల్గొనేలా చేసేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తుంటాయి. ఇలా ఇప్పుడు అభీ బస్ కూడా ఓ కొత్త ఆఫర్‌తో ఓటర్ల ముందుకు వచ్చింది. ఈ ఎన్నికల్లో ఓటు వేయడానికి ప్రజలను ప్రోత్సహించడానికి అభి ఓట్ పేరుతో ..అభీబస్ ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. మే 13న ఓటు వేయడానికి  సొంతూళ్లకు వెళ్లేవారికి ఈ ఆఫర్ కింద బస్ టికెట్ ఛార్జీలో రాయితీని అందించబోతోంది. ఓటు వేయడానికి ఏపీ వెళ్లేవారికి టికెట్ ఛార్జీలో 29 శాతం వరకూ డిస్కౌంట్ ఇస్తున్నట్లు అభి బస్ ప్రకటించింది.

ABHIVOTE కూపన్ కోడ్‌తో టికెట్ బుక్ చేసుకున్నవారికి కనీసం 20 శాతం తగ్గింపు కానీ..  250 రూపాయల వరకూ రాయితీ కానీ లభిస్తుందని అభి బస్ తెలిపింది. దీంతో పాటు వంద రూపాయలు క్యాష్ బ్యాక్ కూడా అదనంగా  పొందే వీలున్నట్లు యాజమాన్యం తెలిపింది. కాకపోతే దీనికోసం టికెట్ బుక్ చేసుకునే సమయంలో..అభి ఓట్ E అని కూపన్ కోడ్ ఉపయోగించాలని సంస్థ సూచించింది. తెలుగురాష్ట్రాల ప్రజల కోసమే ఈ  ప్రత్యేక ఆఫర్‌ను తీసుకువచ్చినట్లు అభి బస్ ఓ ప్రకటనలో తెలియజేసింది.

మరోవైపు తెలంగాణ ఆర్టీసీ కూడా.. విజయవాడకు వెళ్లే  ఏపీ  ప్రయాణికుల కోసం డిస్కౌంట్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లేవారి టికెట్‌పై 10 శాతం రాయితీని ప్రకటించింది. కాకపోతే  ముందుగా టికెట్లు రిజర్వ్  చేసుకున్న వారికి మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుందని టీఎస్ఆర్టీసీ స్పష్టం చేసింది. ఈ డిస్కౌంట్ ఆఫర్ తిరుగు ప్రయాణంలో కూడా వర్తిస్తుందని ప్రకటించింది. కేవలం ఓట్లు  వేయడానికి సొంతూళ్లకు వెళ్లేవారికే కాదని అందరూ ఈ డిస్కౌంట్‌ను ఉపయోగించుకోవవచ్చిని చెప్పింది.  వేసవి సెలవులు, ఎన్నికల వల్ల పెరగబోయే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని..ఈ డిస్కౌంట్ ఆఫర్‌ను తీసుకువచ్చినట్లు  టీఎస్ఆర్టీసీ ఎనౌన్స్ చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + 17 =