ఉమ్మడి పాలమూరు జిల్లా ఓటర్ల తీర్పు ఈసారి ఎలా ఉంటుందో?

Women's Who Have Not Entered In Parliament So Far, Entered In Parliament So Far, Women Not Entered In Parliament, Parliament, Jadcharla, Shadnagar, Mahabubnagar,Women Who Have Not Entered Parliament, Palamuru District, Voters, DK Aruna, Vamshi Chand, Manne Srinivas Reddy, Lok Sabha Elections, Telangana, TS Live Updates, Mango News, Mango News Telugu
Mahabubnagar,Women who have not entered parliament, Palamuru district, voters, DK Aruna

రాజకీయంగా పలుకుబడి ఉన్న ఉమ్మడి పాలమూరు జిల్లాలో  ఇప్పటి వరకు ఒక్క మహిళ కూడా పార్లమెంట్ మెట్లు ఎక్కలేదన్న చర్చ  తెర మీదకు వచ్చింది. ఎంతోకాలంగా మహిళా నేతలు బరిలో ఉంటున్న రెండు స్థానాల్లో కూడా ఒక్క  మహిళనూ  పాలమూరు ప్రజలు లోక్‌సభకు పంపలేదు. మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నా సరే మహిళా నాయకురాలిని గెలిపించుకోలేకపోతున్నారు. మరి కొద్ది రోజుల్లోనే  జరుగనున్న ఎంపీ ఎన్నికల్లో అయినా ఏదొక స్థానం నుంచి మహిళా ఎంపీగా ఎన్నుకుంటారో లేదో అన్నదే ఇప్పుడు ఆసక్తిగా మారింది.

దశాబ్దాలుగా జరుగుతున్న పాలమూరు ఎన్నికల్లో ఎన్నో రకాల ఈక్వేషన్స్ తో అభ్యర్థులు ఎన్నికల్లో విజయం సాధిస్తూ వస్తున్నారు. అయితే తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో  రెండుసార్లు అధికారాన్ని చేపడుతూ వస్తున్న బీఆర్ఎస్‌ను పక్కన పెట్టి కాంగ్రెస్‌కు పట్టం కట్టిన  ఓటర్లు.. పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి తీర్పనిస్తారోనన్న ఆసక్తి పెరుగుతోంది. ఎంతో కాలంగా ఎంతో మంది మహిళ నేతలు ఇక్కడ  బరిలో నిలబడినా ఎవరూ గెలుపును తమ ఖాతాలో వేసుకోలేకపోయారు. ఈ సారైన పాలమూరు ఓటర్లు దానిని తిరగరాస్తారా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

మహబూబ్ నగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఏకైక మహిళా నేత డీకే అరుణ. 1996లో తొలిసారి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగి ఓటమి పాలయిన ఆమె… తిరిగి 2019 ఎంపీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి రెండోస్థానంలో నిలిచారు. ఇప్పుడు మూడోసారి  తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్న అరుణ.. బీజేపీ అభ్యర్థిగానే మరోసారి  బరిలో నిలుస్తున్నారు. ఎలా అయినా సరే ఈసారి పార్లమెంట్లో అడుగుపెట్టాలని  విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని నాగర్ కర్నూల్ స్థానం నుంచి ఎంతోమంది మహిళలు పోటీ చేసినా కూడా ఇప్పటి వరకూ ఎవరినీ విజయం వరించలేదు. 1996లో ఈ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఇందిరా పోటీ చేసి ఓడిపోయారు. 2004లో బీఎస్పీ నుంచి రాణి రత్నమాల పోటీ చేసినా గెలుపును అందుకోలేకపోయారు.  2019 ఎంపీ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగిన బంగారు శృతి  మూడో స్థానానికే పరిమితమయ్యారు.

ఇక ఈ సారి నాగర్ కర్నూల్ నియోజకవర్గం నుంచి  స్వతంత్ర అభ్యర్థిగా శిరీష అలియాస్ బర్రెలక్కతో పాటు మరో ఇద్దరు మహిళలు బరిలో నిలిచారు. అయితే ఎంతో కాలంగా పోటీకే పరిమితమవుతున్న మహిళలు.. నేతలుగా మారి  ఉమ్మడి జిల్లా నుంచి పార్లమెంట్లో అడుగుపెడతారా అన్న చర్చ జరుగుతోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 5 =