సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న సర్వేలు

That Party Is The Winner In Majority Of Surveys, Majority Of Surveys, Majority Of Surveys That Party Is The Winner, That Party Is The Winner, AP Surveys, Surveys, AP Elections 2024,Majority Of Surveys, Surveys Viral On Social Media,BJP, TDP, Janasena, YCP, Congress, Assembly Elections, Lok Sabha Elections, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
AP Elections 2024,majority of surveys, Surveys viral on social media,BJP, TDP, JANASENA, YCP, CONGRESS

ఏపీలో ఎన్నికలకు పట్టుమని 4 రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో.. అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.  అభ్యర్థుల్లో టెన్షన్  పెరుగుతుండగా.. గెలుపోటములపైన అంతటా చర్చ నడుస్తోంది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో..అందరి చూపు సర్వేల మీదే పడుతోంది. నెల రోజుల నుంచి రకరకాల సర్వేలు విడుదల అవడంతో.. గత ఎన్నికలలో కరెక్ట్ అయిన ఫలితాలను ఇచ్చిన సర్వేలను ఎక్కువ మంది గమనిస్తున్నారు.తాజాగా ఐప్యాక్ ఫైనల్ సర్వే పేరుతో ఒక సర్వే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.  ఐ ప్యాక్ నివేదిక ప్రకారం ఎన్డీఏ కూటమికి 118, వైఎస్సార్సీపీకి 39, మరో 18 చోట్ల టఫ్ ఫైట్ ఉంటుందని ఈ సంస్థ అంచనా వేసింది.

ఇటు పయోనీర్స్ ఫ్రీ పోల్ సర్వే పేరుతో ఓ రిపోర్టు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఏప్రిల్ ఒకటి నుంచి 30 వరకు  సర్వే చేసినట్లు చెబుతున్న ఈ  రిపోర్ట్ లో  ఒక్కో శాసనసభ నియోజకవర్గ పరిధిలో 400 నుంచి 500 శాంపిల్స్ సేకరించామని.. కంప్యూటర్ అసిస్టడ్ టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ద్వారా సర్వే చేసినట్లు  ఉంది.

సీట్ల పరంగా చూసుకుంటే ఎన్డీఏ కూటమి 119 అసెంబ్లీ స్థానాల్లో గెలిచే ఛాన్స్ ఉన్నట్లు చెబుతోంది. అటు పార్లమెంట్ స్థానాలకు సంబంధించి 19 చోట్ల కూటమి గెలుపొందుతుందని .. వైసీపీ 46 అసెంబ్లీ, 6 పార్లమెంట్ స్థానాలను మాత్రమే గెలుచుకుంటుందని ఈ సర్వే చెబుతోంది. ఓట్ల శాతానికి సంబంధించి అసెంబ్లీ సీట్లలో ఎన్డీఏకు 49%, వైసీపీకి 41%, ఇండియా కూటమికి 3 నుంచి 4 శాతం, ఇతరులకు 1 నుంచి 2 శాతం ఓట్లు రావచ్చని తేలింది. 4 నుంచి 5 శాతం ఓటర్లు ఇప్పటికీ ఎటూ తేల్చుకోలేదని పయోనీర్స్ చెబుతోంది.

మరోవైపు బి ఫ్రాంక్ పేరుతో మరో సర్వే సోషల్ మీడియాలో రౌండ్లు కొడుతోంది. ఈ సర్వేలో కూడా   కూటమికి 118, వైసీపీకి 39, 18 చోట్ల టఫ్ ఫైట్ అనే తేలింది. మైండ్ షేర్ యునైటెడ్ పేరుతో విడుదల అయిన  మరో సర్వేలో  కూటమికి 33, వైసీపీకి 142 సీట్లు వస్తాయని  చెప్పింది.

ఇంటెలిజెన్స్ బ్యూరో పేరుతో వైరల్ అవుతోన్న మరో సర్వేలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 105, వైసీపీకి 47,  కాంగ్రెస్ కు రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని చెబుతోంది.అయితే రకరకాలుగా కనిపిస్తున్న ఈ సర్వలలో ఏది  ఎంత వరకూ నిజమో  తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. అంటే జూన్ 4 ఏ సర్వే సరైన ఫలితాలు ఇచ్చిందో చూడాలని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × one =