జ‌గ‌న్ సంక‌ల్పం నెర‌వేరేనా?

Is Jagan's Intention Different?,Nara Lokesh,Mangalagiri Constituency,YCP,YS Rajasekhar Reddy,Telugu News,AP State Assembly Elections,Mango News,Mango News Telugu,Andhra Pradesh Elections,Elections 2024,AP Elections 2024,Lok Sabha Polls,AP Polls,AP Politics,AP News,AP Latest News,AP Elections News,AP Elections,AP Assembly Elections 2024,Lok Sabha Elections 2024,TDP,YSRCP,Nara Lokesh Latest News,Nara Lokesh Mangalagiri,Mangalagiri Election Campaign,CM YS Jagan,CM YS Jagan Latest News,TDP vs YSRCP,Mangalagiri Politics,Mangalagiri Elections,CM YS Jagan About Nara Lokesh

చంద్ర‌బాబు త‌న‌యుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ పోటీ చేస్తున్న మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంపై ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌ధానంగా ఫోక‌స్ చేశారు. గ‌త ఎన్నిక‌ల్లో లోకేశ్ ను ఓడించిన వైసీపీ.. ఈసారి కూడా ఓడిస్తే.. ఇక మంగ‌ళ‌గిరిలో లోకేశ్ ప్ర‌స్థానం ముగుస్తుంద‌ని భావిస్తోంది. ఈక్ర‌మంలోనే బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన మ‌హిళ‌ను లోకేశ్ పై పోటీకి నిల‌బెట్టి ఇప్ప‌టికే ఆస‌క్తిక‌ర రాజ‌కీయాల‌కు తెర‌తీశారు. అలాగే.. నియోజ‌క‌వ‌ర్గంలో అధిక సంఖ్య‌లో ఉన్న చేనేత‌ల‌ను ఆక‌ట్టుకుంటున్నారు.  ఇప్పుడు తాజాగా ముఖాముఖి కార్య‌క్ర‌మం ద్వారా వారితో నేరుగా భేటీ అయ్యారు.

మంగ‌ళ‌గిరి నియోజ‌క‌ర్గంలో వైసీపీ చేసిన అభివృద్ధిని వివ‌రించారు. అంతేకాకుండా నియోజ‌క‌వ‌ర్గంలో 54 వేల మందికి ఇళ్ల స్థ‌లాలు ఇచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తే.. చంద్ర‌బాబునాయుడు, లోకేశ్ అడ్డుకున్నార‌ని విమ‌ర్శించారు. ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఓట్లు అడిగేందుకు వ‌స్తే.. ఎందుకు అడ్డుకున్నార‌ని నిల‌దీయాల‌ని ప్ర‌జ‌ల‌కు సూచించారు. మ‌రోసారి అధికారంలోకి వ‌స్తే.. అంద‌రికీ ఇళ్లు క‌ట్టి ఇస్తామ‌ని చెప్పారు. ముఖాముఖిలో భాగంగా ప్ర‌జ‌ల అభిప్రాయాల‌ను తెలుసుకున్నారు. స్థానిక స‌మ‌స్య‌ల‌ను తెల‌పాల‌ని, వాటిని అన్నింటినీ ప‌రిష్క‌రిస్తామ‌ని జ‌గ‌న్ హామీ ఇచ్చారు. బీసీ సామాజిక‌వ‌ర్గం ఎక్కువ‌గా ఉన్న నియోజ‌క‌వ‌ర్గం సీటును అదే సామాజిక‌వ‌ర్గానికి చెందిన మురుగుడు లావ‌ణ్య‌కు కేటాయించి ఇప్ప‌టికే సానుకూల వాతావ‌ర‌ణం ఏర్ప‌రిచిన జ‌గ‌న్‌.. ఇప్పుడు నేరుగా నియోజ‌క‌వ‌ర్గంలో ముఖాముఖి కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌డం ద్వారా లోకేశ్ ఓట‌మికి కంక‌ణం క‌ట్టుకున్నార‌ని స్ప‌ష్టం అవుతోంది.

మంగళగిరిలో మళ్లీ వైసీపీ జెండా ఎగురేలా ప్ర‌జ‌లంద‌రూ దీవించాల‌ని కోరారు. ఇప్ప‌టికే సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్ కే స‌హా.. ఇత‌ర నాయ‌కులు లావ‌ణ్య గెలుపు కోసం విశేషంగా కృషి చేస్తున్నారు. ఈక్ర‌మంలో రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం నుంచి వచ్చిన లావణ్య గెలుపు ఖాయమని ఆ పార్టీ నేత‌లు అంటున్నారు. నాన్‌ లోకల్‌, బీసీ అభ్యర్థుల మధ్య పోటీ అనే చ‌ర్చ‌కు తెర‌పైకి తెచ్చి రాజ‌కీయాల‌ను హీటెక్కిస్తున్నారు. ఇక మురుగుడు లావణ్య విషయానికొస్తే ఆమెది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. లావణ్య తల్లి కాండ్రు కమల 2009 నుంచి 2014 వరకు మంగళగిరి ఎమ్మెల్యేగా పనిచేశారు. అంతకుముందు 2004లో మంగళగిరి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గానూ ఎన్నికయ్యారు. లావణ్య మామ మురుగుడు హనుమంతరావు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఎథిక్స్‌ కమిటీ చైర్మన్‌గానూ వ్యవహరిస్తున్నారు. గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కేబినెట్‌లోనూ పనిచేశారు. ఆ కుటుంబం కూడా లావ‌ణ్య గెలుపు కోసం తీవ్రంగా శ్ర‌మిస్తోంది. ఈక్ర‌మంలో మంగ‌ళ‌గిరి రాజ‌కీయాలు ఆస‌క్తిని గొలుపుతున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 2 =