పోలింగ్ సమయాన్ని పెంచిన ఎన్నికల సంఘం

Good News For Voters In Telangana, Good News For Voters, Election Commission, Extended Polling Time, Voters In Telangana, Voters, Extended Polling 6Pm, Voting Timings, Timings Extended, Election Commission New Rules, ECI, Telangana, TS Live Updates, Mango News, Mango News Telugu
Election Commission, extended polling time,voters in Telangana,voters

తెలంగాణలో మే 13న పోలింగ్‎లో పాల్గొనే వారికి  కేంద్ర ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో మే 13న  జరిగే పోలింగ్ సమయాన్ని పెంచింది తమ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించింది.  ఆరోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.

సాధారణంగా  ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్  సమయాన్ని నిర్వహిస్తారు. అయితే  తాజాగా ఒక గంట సమయాన్ని పొడిగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా  తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ప్రతి ఒక్కరూ ఉక్కపోతలతో, తీవ్రమైన వడగాల్పులకు, ఎండ తీవ్రతకు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచే భానుడు తన ప్రతాపం చూపించడంతో.. 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు.అత్యవసరం అయితేనే కాలు బయటపెడుతున్నారు.

దీనిపై వాతావరణ శాఖ కూడా తెలంగాణ వాసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. మే నెల మొత్తం ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని అత్యవసరం అయితే తప్ప ఎవరూ బయటకు వెళ్లొద్దని, చిన్నారులు, వృద్ధులు ఇంట్లోనే ఉండాలని కీలక ప్రకటన చేసింది.  ఈ ఎండ తీవ్రత వల్ల  పోలింగ్ కేంద్రాలకు వచ్చి  ఓటు వేయాలనుకునే వారికి  కాస్త ఇబ్బందికి గురి చేస్తుందని కేంద్ర ఎన్నికల అధికారులు పోలింగ్ సమయాన్ని పెంచినట్లు తెలుస్తోంది.

మరోవైపు సమ్మర్ కారణంగా పోలింగ్ సమయాన్ని పెంచాలని కొన్ని రాజకీయ పార్టీలు ఈసీకి వినతి పత్రాన్ని కూడా అందించినట్లు తెలుస్తోంది. రాజకీయ పార్టీల ఫిర్యాదుతో పోలింగ్ సమయాన్ని సాయంత్రం 6 గంటల వరకు పెంచినట్లు ఈసీ స్పష్టం చేసింది. మామూలు రోజుల్లో సాయంత్రం 5 గంటల వరకు క్యూ లైన్లలో నిలుచున్న వారికి మాత్రమే ఓటు హక్కును కల్పించే పోలింగ్ అధికారులు తాజాగా ఈసీ తీసుకున్న నిర్ణయం వల్ల సాయంత్రం 6 గంటల వరకు క్యూ లైన్లలో నిలుచున్న ప్రతి ఒక్కరికీ ఓటు వేయడానికి అవకాశం కలుగుతుంది.దీని ప్రకారం పోలింగ్ ప్రక్రియ పూర్తవడానికి రాత్రి 7 గంటలు దాటొచ్చని అంచనా వేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 5 =