ప్రారంభమైన పైడితల్లి సిరిమానోత్సవాలు.. ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి కొట్టు సత్యనారాయణ

AP Endowment Minister Kottu Satyanarayana Offers Silk Clothes For The Goddess Pydithalli During Sirimanotsavam, AP Endowment Minister Kottu Satyanarayana, Goddess Pydithalli, Pydithalli Sirimanotsavam, Kottu Satyanarayana Offers Silk Clothes For Pydithalli, Mango News, Mango News Telugu, Goddess Pydithalli Sirimanotsavam, Endowments Minister Offers Clothes For Goddess Pydithalli, Pydithalli Sirimanotsavam Latest News And Updates, AP Endowments Minister, Endowment Minister Kottu Satyanarayana, Kottu Satyanarayana News And Live Updates

ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరంలో పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాలు నేటినుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను సమర్పించారు. ఈ క్రమంలో మంత్రి తలపై పట్టువస్త్రాలను పెట్టుకుని రాగా, ఆలయ పూజారితో పాటు అధికారులు మంత్రికి స్వాగతం పలికారు. ఇక మంత్రి సత్యనారాయణ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమం అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలందరూ బాగుండేలా చూడాలని అమ్మవారిని ప్రార్ధించానని తెలిపారు. అలాగే ఉత్తరాంధ్రలో పరిపాలన రాజధాని ఏర్పాటయ్యేలా చూడాలని అమ్మవారిని కోరుకున్నానని, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే వికేంద్రీకరణ ఒక్కటే మార్గమని ఆయన చెప్పారు. ఈ మేరకు సీఎం జగన్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని, ఆయనకు తమతో పాటు ప్రజలందరూ మద్దతుగా నిలవాలని మంత్రి సత్యనారాయణ స్పష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + nine =