తుఫాన్ ఎఫెక్ట్.. లోకేష్ పాదయాత్రకు మరోసారి బ్రేక్

Typhoon effect Lokesh Padayatra break once again,Typhoon effect,Lokesh Padayatra break,Padayatra break once again,nara lokesh, ap, yuvagalam padayatra, breakk for yuvagalam padayatra, chandrababu naidu,Mango News,Mango News Telugu,Lokeshs Yuvagalam,Cyclone Michuang,Typhoon Latest News,Typhoon Latest Updates,Lokesh Padayatra Latest News,Lokesh Padayatra Latest Updates,Cyclone Michuang News Today,Cyclone Michuang Live News
nara lokesh, ap, yuvagalam padayatra, breakk for yuvagalam padayatra, chandrababu naidu

నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర మరోసారి నిలిచిపోయింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌తో ఇటీవల పాదయాత్ర నిలిచిపోయిన విషయం తెలిసిందే. చంద్రబాబు నాయుడు జైలు నుంచి విడుదల కావడంతో దాదాపు రెండు నెలల తర్వాత నారా లోకేష్ తిరిగి పాదయాత్రను ప్రారంభించారు. ప్రస్తుతం మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా ఏపీలోని తీర ప్రాంతాల్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. దీంతో పాదయాత్రకు బ్రేక్ ఇవ్వాలని లోకేష్ నిర్ణయించారు. మూడు రోజుల పాటు యువగళం పాదయాత్రను లోకేష్ నిలిపివేశారు.

ప్రస్తుతం లోకేష్ యువగళం పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో కొనసాగుతోంది. అదే జిల్లాలో రెండు, మూడు రోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. మరో రెండు రోజులు వర్షాలు ఇలానే కొనసాగే అవకాశం కనిపిస్తోంది. దీంతో లోకేష్ యువగళం పాదయాత్రను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే భారీ వర్షాలు, వరదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని టీడీపీ కార్యకర్తలుకు లోకేష్ పిలుపునిచ్చారు. సహాయ కార్యక్రమాల్లో టీడీపీ కార్యకర్తలు ముందుండాలని ఆదేశించారు.

ముంచుకొస్తోన్న తుఫాన్ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని లోకేష్ సూచించారు. విపత్తుల సంస్థ జారీ చేసే హెచ్చరికలను ఎప్పటికప్పుడు ప్రజలు గమనిస్తూ జాగ్రత్తగా ఉండాలని అన్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. తుఫాన్ బాధితులకు కార్యకర్తలు ఆసరాగా నిలవాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలు ఒకవైపు సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటూ.. పాదయాత్రలో పాల్గొనడం కష్టమని.. అందుకే పాదయాత్రకు బ్రేక్ ఇచ్చామని లోకేష్ తెలిపారు.

మరోవైపు మిచాంగ్ తుఫాన్ నేడు తీరం దాటనుంది. నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీవ్ర తుఫానుగా తీరం దాటనుంది. దీని ప్రభావంతో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరన శాఖ అధికారులు చెబుతున్నారు. అటు నారా లోకేష్ తిరిగి ఈనెల 7న యువగళం పాదయాత్రను ప్రారంభించనున్నారు. ఈనెల 6న సాయంత్రం పిఠాపురం నియోజకవర్గానికి లోకేష్ చేరుకోనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × two =