మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్యకేసు.. నేడు సీబీఐ విచారణకు హాజరవనున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి

Kadapa MP Avinash Reddy To Attend For CBI Inquiry Today in Ex-Minister Vivekananda Reddy Assassination Case,CBI Issues Notices,Kadapa MP Avinash Reddy,Ex-Minister YS Vivekananda Reddy,YS Vivekananda Reddy Assassination Case,Mango News,Mango News Telugu,Vivekananda Reddy Wikipedia,Ys Avinash Reddy,Ys Avinash Reddy Grandfather,Tdp Chief Chandrababu Naidu,AP CM YS Jagan Mohan Reddy,YS Jagan News And Live Updates, YSR Congress Party, Andhra Pradesh News And Updates, AP Politics, Janasena Party, TDP Party, YSRCP, Political News And Latest Updates

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్యకేసుకు సంబంధించి కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి శనివారం సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ) ఎదుట హాజరు కానున్నారు. ఈ మేరకు ఆయనకు ఇప్పటికే రెండుసార్లు హైదరాబాద్‌లోని సీబీఐ అధికారులు సీఆర్‌పీసీ సెక్షన్ 160 కింద ఎంపీకి నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఈరోజు విచారణకు వస్తున్నట్లు అధికారులకు లేఖ ద్వారా తెలియపరిచారు. అలాగే ఎంపీ సీబీఐకి రాసిన లేఖలో కొన్ని ప్రత్యేక విజ్ఞప్తులు చేశారు. దీని ప్రకారం.. ‘వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్యకేసులో కొన్ని మీడియా సంస్థలు మొదటినుంచీ నా వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే విధంగా నాపై అసత్య ప్రచారాలు చేస్తున్నాయి. అందుకే విచారణ పారదర్శకంగా జరగాలని కోరుకుంటున్నా. దీనికోసం విచారణ సందర్భంగా ఆడియో, వీడియో రికార్డింగ్ జరపించాలి. అలాగే విచారణ సమయంలో నా తరపు లాయర్‌ అక్కడే ఉండేందుకు అనుమతి ఇవ్వాలి. నా ఈ విజ్ఞప్తులను సీబీఐ అధికారులు పరిగణలోకి తీసుకోవాలి’ అని ఆ లేఖలో కోరారు.

అయితే దీనికిముందు తొలుత ఎంపీకి సీబీఐ అధికారులు జనవరి 24న వారి ఎదుట హాజరుకావాలని నోటీసులు ఇవ్వగా.. తాను ముందుగా నిర్ణయించుకున్న పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నందున కొంత సమయం ఇవ్వాలని ఎంపీ అవినాష్ రెడ్డి కోరారు. ఎంపీ అభ్యర్థన మేరకు, జనవరి 28న హైదరాబాద్ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని కోరుతూ సీబీఐ మళ్లీ నోటీసులు ఇచ్చింది. ఈ నేసథ్యంలో ఆయన నేడు హైదరాబాద్‌లోని సీబీఐ అధికారుల ఎదుటకు రానున్నారు. దీంతో ఈ కేసులో ఆయన స్టేట్‌మెంట్‌ను నమోదు చేసేందుకు అధికారులు నేడు సిద్ధమయ్యారు. కాగా మాజీ మంత్రి వివేకానంద రెడ్డి మార్చి 15, 2019న తన నివాసంలో హత్యకు గురయ్యారు. అయితే అసెంబ్లీ ఎన్నికల సమయం కావడం, రాజకీయంగా పెద్ద కుటుంబం కావడంతో ఈ హత్య రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here