శ్రీనగర్‌లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర, ముగింపు సభ వరకు తగిన భద్రత కల్పించాలి, అమిత్ షాకు ఖర్గే లేఖ

Congress President Mallikarjun Kharge Writes to Amit Shah over security Issue in Bharat Jodo Yatra at Jammu Kashmir,Rahul Gandhi Padayatra,Bharat Jodo Yatra Enters Jammu & Kashmir, Rahul Gandhi Padayatra,Mango News,Mango News Telugu,Bharat Jodo Yatra,Priyanka Gandhi Participate In Rahul's Yatra, Bharat Jodo Yatra Madhya Pradesh, Rahul Gandhi Bharat Jodo Yatra, Rahul Gandhi Congress, Rahul Gandhi Padha Yatra, Congress Party , Indian National Congress, Inc Latest News And Updates, Sonia Gandhi, Priyanka Gandhi, Rahul Gandhi, Congress President Mallikarjun

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపడుతున్న ‘భారత్ జోడో యాత్ర’ ప్రస్తుతం జమ్మూ కశ్మీర్ లో కొనసాగుతోన్న విషయం తెలిసిందే. కాగా భద్రతా కారణాల దృష్ట్యా రాహుల్ పాదయాత్ర శుక్రవారం నాడు రద్దయింది. అలాగే పలు రాజకీయ పార్టీల నాయకులతో జనవరి 30వ తేదీన భారత్ జోడో యాత్ర ముగింపు సభను భారీగా నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో శ్రీనగర్‌లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మరియు ముగింపు సభ వరకు తగిన భద్రత కల్పించాలని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే శుక్రవారం లేఖ రాశారు.

“ఈరోజు (జనవరి, 27) ఉదయం భారత్ జోడో యాత్రలో దురదృష్టకర భద్రతా లోపానికి సంబంధించి నేను మీకు ఈ లేఖ వ్రాస్తున్నాను, ఇది మీకు ఇప్పటికే తెలిసి ఉండవచ్చు. రాహుల్ గాంధీ యొక్క భద్రతా వివరాలను చూసే భద్రతా అధికారుల సలహా మేరకు, యాత్రను నేటికి నిలిపివేయవలసి వచ్చింది. మేము జమ్మూ కాశ్మీర్ పోలీసులను అభినందిస్తున్నాము మరియు యాత్ర ముగిసే వరకు వారు పూర్తి భద్రతను కొనసాగిస్తామని చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నాము. అయినప్పటికీ, ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో సామాన్య ప్రజలు భారత్ జోడో యాత్రలో చేరి నడవడం మీరు అభినందిస్తారని అనుకుంటున్నాం. సాధారణ ప్రజలు యాత్రలో చేరడం సహజసిద్ధమైన విషయం కాబట్టి రోజులో ఎంత మంది పాల్గొంటారో నిర్వాహకులు చెప్పడం కష్టం. రాబోయే రెండు రోజులలో యాత్రకు మరియు జనవరి 30వ తేదీన శ్రీనగర్‌లో జరిగే ముగింపు కార్యక్రమంలో భారీ జనసమూహం చేరుతుందని మేము ఆశిస్తున్నాము. జనవరి 30వ తేదీన జరగనున్న ముగింపు కార్యక్రమానికి పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు, ఇతర ముఖ్య రాజకీయ పార్టీల నేతలు హాజరవుతున్నారు. మీరు ఈ విషయంలో వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని, జనవరి 30వ తేదీన శ్రీనగర్‌లో జరిగే యాత్ర మరియు కార్యక్రమం ముగిసే వరకు తగిన భద్రత కల్పించాలని సంబంధిత అధికారులకు సూచనలు చేయాలని కోరుతున్నాం. మీరు జోక్యం చేసుకుంటారని భావిస్తున్నాం. ధన్యవాదాలు” అంటూ కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాకు రాసిన లేఖలో మల్లిఖార్జున్ ఖర్గే పేర్కొన్నారు.

మరోవైపు శనివారం ఉదయం జమ్మూ కశ్మీర్‌ లోని అవంతిపొరా నుండి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను తిరిగి ప్రారంభించారు. శనివారం ఈ యాత్రలో పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ, రాహుల్ గాంధీతో కలిసి నడిచారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × two =