మరింత ఆలస్యంగా టీడీపీ-జనసేన అభ్యర్థుల జాబితా

Later TDP Janasena Candidate List,TDP Janasena Candidate List,Pawan kalyan, Chandrababu naidu, TDP-Janasena alliance,Mango News,Mango News Telugu,Janasena MLA Candidates List,Janasena party,AP Politics,AP Latest Political News,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,Andhra Pradesh News and Live Updates,Janasena Candidate List Latest News,Janasena Candidate List Live Updates
Pawan kalyan, Chandrababu naidu, TDP-Janasena alliance

ఏపీలో ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఏప్రిల్ మొదటివారంలోనే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ఒకేసారి జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈక్రమంలో ప్రధాన పార్టీలన్నీ అప్రమత్తమయ్యాయి. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. వైసీపీ ఇప్పటికే అభ్యర్థుల నాలుగు జాబితాలను ప్రకటించింది. ప్రస్తుతం అయిదో జాబితాపై కసరత్తు చేస్తోంది. మరో రెండు, మూడు రోజుల్లో వైసీపీ అయిదో జాబితా.. ఆ తర్వాత పూర్తి అభ్యర్థుల జాబితా వెలువడే అవకాశాలు ఉన్నాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

ఇక వైసీపీని ఢీ కొట్టేందుకు ఈసారి పొత్తుపెట్టుకొని ఎన్నికలకు వెళ్తున్నాయి జనసేన-తెలుగు దేశం పార్టీలు. ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే జనసేన-టీడీపీలు సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు వైసీపీ నాలుగు జాబితాలను ప్రకటించగా.. తెలుగుదేశం-జనసేన పార్టీలు ఒక జాబితాను కూడా ప్రకటించకపోవడం చర్చనీయాంశంగా మారింది.

సంక్రాంతి పండుగ సమయంలోనే టీడీపీ-జనసేన అభ్యర్థుల మొదటి జాబితాలు వెలువడుతాయని అంతా అనుకున్నారు. ఆ తర్వాత పండుగ ముగిసిన తర్వాత ఆ పార్టీ అభ్యర్థుల జాబితాలు వెలువడుతాయని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు టీడీపీ-జనసేన అభ్యర్థుల జాబితాలు వచ్చే సరికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈక్రమంలో దీని వెనుక కారణం ఏమయి ఉంటుందనే దానిపై జనాలు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు.

అయితే టీడీపీ-జనసేన పార్టీలు బీజేపీ పొత్తు కోసం ఎదురు చూస్తున్నాయట. ప్రస్తుతం బీజేపీ పెద్దలంతా అయోధ్య రామమందిర ప్రారంభోత్సవంలో బిజీగా ఉన్నారు. ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత పొత్తుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందట. ఈక్రమంలో బీజేపీ నిర్ణయం కోసం టీడీపీ, జనసేన పార్టీలు ఎదురు చూస్తున్నాయని తెలుస్తోంది. బీజేపీ నిర్ణయాన్ని బట్టి అభ్యర్థుల ఎంపికలో మార్పులు చేర్పులు చేసి జాబితాను ప్రకటించాలని చంద్రబాబు నాయుడు, పవన్ భావిస్తున్నారట. అందుకే తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేయడంలో ఆలస్యం చేస్తున్నారట. మరి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇంత ఎదురు చూస్తున్నప్పటికీ.. బీజేపీ ఆ కూటమితో చేతులు కలుపుతుందా? లేదా? అన్నది చూడాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 2 =