నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి, త్వరగా కోలుకోవాలంటూ ఎమోషనల్ ట్వీట్

Megastar Chiranjeevi Emotional Tweet About Nandamuri Taraka Ratna Over His Health Condition,Megastar Chiranjeevi Tweet About Nandamuri Taraka Ratna,Megastar Chiranjeevi,Nandamuri Taraka Ratna Health Condition,Mango News,Mango News Telugu,Taraka Ratna for Speedy Recovery,Nandamuri Taraka Ratna,Nandamuri Taraka Ratna Latest News and Updates,Nandamuri Taraka Ratna Health,Nandamuri Taraka Ratna Health Status,Nandamuri Taraka Ratna Latest Updates,Nandamuri Taraka Ratna Health Updates,Nandamuri Taraka Ratna Latest Updates,Yuvagalam Padayatra

సినీ నటుడు నందమూరి తారకరత్న తీవ్ర గుండెపోటుకు గురై బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన హెల్త్ అప్‌డేట్ గురించి వైద్యులు ప్రతిరోజూ ప్రకటన చేస్తున్నారు. తారకరత్న పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నప్పటికీ ఆయన శరీరం చికిత్సకు స్పందిస్తోందని వారు వెల్లడించడం అభిమానులకు కొంచెం ఊరటనిస్తోంది. అలాగే తారకరత్నకు ఎక్మో పెట్టలేదని, ఆయనకు వెంటిలేటర్‌పైనే చికిత్స కొనసాగుతోందని ఆయన బాబాయి నందమూరి రామకృష్ణ సోమవారం సాయంత్రం స్పష్టం చేశారు. దీంతో అతను తిరిగి కోలుకుంటాడనే నమ్మకం అందరిలో కలుగుతోంది.

ఈ నేపథ్యంలో తాజాగా మెగాస్టార్ చిరంజీవి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై స్పందించారు. తన ట్విట్టర్ వేదికగా తారకరత్న గురించి ఒక ఎమోషనల్ నోట్‌ను పంచుకున్నారు. కాగా ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అందులో.. ‘నా సోదరుడు, తారకరత్న బాగా కోలుకుంటున్నాడని మరియు చింతించాల్సిన పని లేదని విన్న తర్వాత, నేను చాలా ఉపశమనం పొందాను’ అని పేర్కొంటూ తారకరత్న త్వరగా కోలుకుని ఇంటికి తిరిగి రావాలని ఆకాంక్షించారు. ఇక నందమూరి హీరో పరిస్థితిపై చిరంజీవి భావోద్వేగంతో చేసిన ట్వీట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కాగా ఈనెల 27న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేతృత్వంలో మొదలైన ‘యువగళం’ పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న, ఈ సందర్భంగా అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here