బడ్జెట్‌ సమావేశాలపై గవర్నర్ తమిళిసైతో మంత్రి ప్రశాంత్ రెడ్డి, అధికారులు సమావేశం

Minister Vemula Prashanth Reddy Officials Called on Governor Tamilisai Soundararajan at Raj Bhavan to Discuss on Budget session,Minister Vemula Prashanth Reddy, Officials Called on Governor,Tamilisai Soundararajan at Raj Bhavan,to Discuss on Budget session,Mango News,Mango News Telugu,Telangana Budget 2023 On Feb 3 Or Feb 5,Telangana Budget 2023,Telangana Budget Wikipedia,Telangana Budget 2023 24,Telangana Budget 2023,Telangana Education Budget,Telangana Budget Date,Andhra Pradesh Budget,Telangana Budget 2022 Pdf,Telangana Budget 2023-24,Telangana Govt Budget 2020-21,Budget Of Telangana 2023,Structure Of Government Budget

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల నిర్వహణ, బడ్జెట్‌ సమర్పణకు గవర్నర్‌ ఆమోదం, గవర్నర్ ప్రసంగంపై సోమవారంతో స్పష్టత వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ముందుగా నిర్ణయించిన విధంగానే ఫిబ్రవరి 3వ తేదీన బడ్జెట్‌ సమావేశాలు మొదలుకానుండగా, ఫిబ్రవరి 6వ తేదీన రాష్ట్ర 2023-24 వార్షిక బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కాగా అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం రోజున ఉభయ సభలను (శాసనసభ, శాసనమండలి) ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించనున్నారు. అలాగే బడ్జెట్‌ సమర్పణకు గవర్నర్ ఆమోదం తెలిపి, బడ్జెట్ సమర్పణ పత్రాలపై సంతకం చేశారు.

ముందుగా సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ఆదేశాలతో రాష్ట్ర శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు రాజ్‌భవన్‌ కు వెళ్లి గవర్నర్‌ తమిళిసై సౌందరాజన్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బడ్జెట్‌ సమావేశాలపై గవర్నర్ తమిళిసైతో మంత్రి, అధికారులు కీలకంగా చర్చించారు. గవర్నర్ ప్రసంగం, ఉభయసభలో ప్రోరోగ్, తిరిగి సమావేశాలకు నోటిఫికేషన్, బడ్జెట్ సమర్పణకు ఆమోదం వంటి అంశాలపై గవర్నర్ తో చర్చించారు. దీంతో ఈ భేటీ అనంతరం బడ్జెట్ ఆమోదంపై ఏర్పడిన సందిగ్ధం తొలిగిపోయి, అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలకు మార్గం సుగమమైంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here