ఫిబ్రవరి 8న సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ మీటింగ్

CM YS Jagan To Chair AP Cabinet Meeting on February 8th,CM Jagan,Jagan Chaired Cabinet Meeting,AP Cabinet Meeting,Mango News,Mango News Telugu,Increase of Pensions,Pensions Increase To Rs 2750,AP Cabinet Meeting Latest News and Updates,Tdp Chief Chandrababu Naidu,AP CM YS Jagan Mohan Reddy, YS Jagan News And Live Updates, YSR Congress Party, Andhra Pradesh News And Updates, AP Politics, Janasena Party, TDP Party, YSRCP, Political News And Latest Updates

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన ఫిబ్రవరి 8, బుధవారం ఉదయం 11 గంటలకు వెలగపూడి ఏపీ సచివాలయంలోని కేబినెట్ మీటింగ్ హాల్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ సమావేశంలో చర్చించే అంశాల ప్రతిపాదనలు సిద్ధం చేసి, కేబినెట్ హ్యాండ్ బుక్‌లో వివరించిన విధంగా నిర్దేశించిన ఫార్మాట్ లో ఫిబ్రవరి 6, సాయంత్రం 4 గంటల లోపు పంపాలని వివిధ శాఖల చీఫ్ సెక్రటరీలు/ప్రిన్సిపల్ సెక్రటరీలు/సెక్రటరీలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కేఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు.

ఈ‌ కేబినెట్ భేటీలో పలు అంశాలపై చర్చించి, సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ, బడ్జెట్ ప్రతిపాదనలు, ప్రవేశపెట్టే బిల్లులపై కీలకంగా చర్చించే అవకాశం ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, చేపట్టబోయే ఇతర కార్యక్రమాలు కూడా కీలకంగా చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నట్టు సమాచారం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here