జనసేన పోటీ చేయబోయే స్థానాలు ఇవే..?

AP Elections, Janasena, Telugu desam Party, Janasena seats, Pawan kalyan, BJP, 23 MLA seats, AP Assembly Sessions 2024,AP Assembly Session LIVE, Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, AP Politics, Mango News Telugu, Mango News
AP Elections, Janasena, Telugu desam Party, Janasena seats, Pawan kalyan

ఏపీలో ఎన్నికలు ముంచుకొస్తుండడంతో ప్రధాన పార్టీలన్నీ దూకుడు పెంచేశాయి. వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నాయి. ఇప్పటికే వైసీపీ విడతల వారీగా అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తోంది. త్వరలో పూర్తి జాబితాను ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. ఈక్రమంలో పొత్తుపెట్టుకొని ఎన్నికలకు వెళ్తోన్న తెలుగు దేశం-జనసేన పార్టీలు కూడా స్పీడ్ పెంచేశాయి. సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టేశాయి. ఇప్పటికే పలుమార్లు సమావేశమై సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేసిన చంద్రబాబు-పవన్ కళ్యాణ్ మరోసారి సమావేశమయ్యారు.

ఆదివారం రెండుసార్లు చంద్రబాబు-పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఆదివారం మధ్యాహ్నం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఇద్దరు నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీట్ల సర్దుబాటు.. ఎవరెక్కడ పోటీ చేయాలనే దానిపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తీవ్ర చర్చలు జరిపినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో ఆదివారం రాత్రి కూడా మరోసారి ఇద్దరు నేతలు సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా జనసేన పోటీ చేయబోయే స్థానాలను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

జనసేన బలంగా ఉన్న 35 స్థానాలను చంద్రబాబు జనసేనకు కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు జనసేన పోటీ చేయబోయే స్థానాలకు సంబంధించి ఓ జాబితా వైరలవుతోంది. రాజోల్, అమలాపురం, పిఠాపురం, రాజానగరం, విశాఖ సౌత్, కాకినాడ రూరల్, ఉంగుటూరు, దర్శి, అనంతపూర్, రాజమండ్రి, నెల్లిమర్ల, తెనాలి, నరసాపురం, భీమవరం, రైల్వే కోడూరు, తాడేపల్లిగూడెం, కొత్తపేట, పోలవరం, విజయవాడ వెస్ట్, గుంటూరు ఈస్ట్-వెస్ట్, ఎలమంచిలి, పెందుర్తి, అవనిగడ్డ, గాజువాక, భీమిలి, పెడన, నిడదవోలు, ఏలూరు, తణుకు, పి.గన్నవరం, రాజంపేట, తిరుపతి, నెల్లూరు అర్బన్/రూరల్, మదనపల్లె, కైకలూరు స్థానాలను జనసేనకు కేటాయించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ జాబితాను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + 19 =