ఏపీ టెట్-2022 నోటిఫికేషన్ విడుదల, పూర్తి వివరాలు ఇవే…

Andhra Pradesh Teacher Eligibility Test-2022 Notification Released, Andhra Pradesh Teacher Eligibility Test-2022, Teacher Eligibility Test-2022 Notification Released, 2022 Teacher Eligibility Test Notification Released, Teacher Eligibility Test Notification Released, Teacher Eligibility Test, Notification Released, Teacher Eligibility Test-2022, 2022 Teacher Eligibility Test, AP TET-2022, AP TET-2022 News, AP TET-2022 Latest News, AP TET-2022 Latest Updates, AP TET-2022 Live Updates, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్/ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)-2022 ను ఆగస్టు 6 నుంచి 21వరకు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ టెట్-2022 నోటిఫికేషన్ ను పాఠశాల విద్యా శాఖ శుక్రవారం నాడు విడుదల చేసింది. ఏపీ టెట్-2022 కోసం జూన్ 16వ తేదీ నుంచి జూలై 16వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో అధికారిక వెబ్ సైట్ లో http://cse.ap.gov.in దరఖాస్తులు స్వీకరించనున్నారు. అభ్యర్థులు దరఖాస్తును ఆన్‌లైన్‌లో సమర్పించడానికి మరియు కంప్యూటర్ బేస్డ్ పరీక్ష కోసం పేపర్-I (A), (B), పేపర్-II (A), (B) లకు విడివిడిగా ఒక్కోదానికి రూ.500/- ఫీజును జూన్ 15 నుండి జూలై 15 వరకు పేమెంట్ గేట్‌వే ద్వారా చెల్లించాలని సూచించారు.

1 నుండి 5 తరగతులకు ఉపాధ్యాయులుగా ఉండాలనుకునే అభ్యర్థి పేపర్-I (A)కి హాజరు కావాలని, 6 నుండి 8 తరగతులకు ఉపాధ్యాయులుగా ఉండాలనుకునే అభ్యర్థులు మరియు 6 నుండి 8 తరగతులకు కోసం భాషా పండితులు పేపర్-II (A)కి హాజరు కావాలని సూచించారు. స్పెషల్ ఎడ్యుకేషన్‌లో 1 నుండి 5 తరగతులకు ఉపాధ్యాయులుగా ఉండాలనుకునే అభ్యర్థి పేపర్ I (B) కింద పరీక్షకు హాజరు కావాలని మరియు స్పెషల్ ఎడ్యుకేషన్‌ కు సంబంధించి 6 నుండి 8 తరగతులకు ఉపాధ్యాయులుగా ఉండాలనుకునే అభ్యర్థులు పేపర్ II(B) కి హాజరు కావాలన్నారు. ఇక 1 నుండి 8 వరకు అన్ని తరగతులకు ఉపాధ్యాయులుగా ఉండాలనుకునే అభ్యర్థులు అవసరమైన అర్హతల ప్రకారం పేపర్-I (A), (B), పేపర్-II (A), (B) అన్ని పేపర్‌ లకు హాజరుకావచ్చని చెప్పారు. అభ్యర్థి అన్ని పేపర్లకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే, వారు ఒక్కో పేపర్‌ కు విడివిడిగా రూ.500/- ఫీజు చెల్లించాలని చెప్పారు.

ఇక ఏపీ టెట్-2022 పరీక్ష కోసం జూలై 25 నుంచి హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. పరీక్షల అనంతరం ప్రైమరీకీ ని ఆగస్టు 31న విడుదల చేస్తామని, అభ్యంతరాలు స్వీకరణ అనంతరం ఫైనల్ కీ ని సెప్టెంబర్ 12న విడుదల చేస్తామని చెప్పారు. అలాగే సెప్టెంబర్ 14న ఫలితాలను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ముందుగా పాఠశాలల్లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం పరీక్షలు రాసేందుకు టెట్ పరీక్షలో అర్హత సాదించడాన్ని కేంద్రం తప్పనిసరి చేయడంతో రాష్ట్రప్రభుత్వాలు టెట్ పరీక్షను నిర్వహిస్తున్నాయి. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ)కి అనుగుణంగా రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో జాతీయ ప్రమాణాలు మరియు ఉపాధ్యాయుల నాణ్యత ప్రమాణాలను నిర్ధారించడం టెట్ పరీక్ష యొక్క లక్ష్యమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, మండలపరిషత్, జిల్లాపరిషత్, మున్సిపాలిటీ, ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలలు మరియు ప్రైవేట్ అన్-ఎయిడెడ్ పాఠశాలలు మొదలైన వాటిలో ఉపాధ్యాయులు కావాలనుకునే అభ్యర్థుల నుండి ఏపీ టెట్-2022 కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయని పాఠశాల విద్యా శాఖ కమిషనర్ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 9 =