ఏపీలో 16 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు, రూ.11,400 కోట్లు కేటాయింపు – మంత్రి ఆళ్ల నాని

16 medical colleges in Andhra Pradesh, 16 New Medical Colleges In AP, 16 New Medical Colleges Will be Established Soon in AP, Andhra Pradesh, AP News, AP Political Updates, AP Political Updates 2020, Minister Alla Nani, Vizianagaram

ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని జూలై 13, సోమవారం నాడు పశ్చిమగోదావరిలోని ఏజెన్సీ ప్రాంతాలలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా పోలవరం నియోజకవర్గంలోని బుట్టాయిగూడెం కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను మంత్రి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బుట్టాయిగూడెంలో 10 ఎకరాలు స్థలంలో రూ. 75 కోట్లతో మల్టీ స్పెషలిటీ ఆసుపత్రి నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు. అలాగే రాష్ట్రంలో 7 ఐటీడీఏ ప్రాంతాల్లో మల్లీ స్పెషలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని మంత్రి తెలిపారు.

మరోవైపు రాష్ట్రంలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయని, అదనoగా మరో 16 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించే లక్ష్యంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు సీఎం వైఎస్ జగన్ రూ.11,400 కోట్లు కేటాయించారని మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × five =