కొత్త జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు.. స్పందించిన మంత్రి కొడాలి నాని

Andhra Pradesh New Districts, Andhra Pradesh New Districts Names List 2021, Andhra Pradesh News Today, AP, AP CM YS Jagan, AP CM YS Jagan Regarding Names For New Districts, AP New 26 Districts, AP New Districts, AP New Districts List, ap new districts list 2022, AP News, CM YS Jagan, Kodali Nani Praises CM YS Jagan Over Forming New District Named NTR, Mango News, Mango News Telugu, Minister Kodali Nani, Minister Kodali Nani Praises CM YS Jagan, Minister Kodali Nani Praises CM YS Jagan Over Forming New District Named NTR, New District Named NTR, New Districts Of Andhra Pradesh, New Districts Of AP, YS Jagan

స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరిట ఎన్టీఆర్‌ జిల్లాను ప్రకటించడంపై ఏపీ పౌరసరఫరాల శాఖా మంత్రి కొడాలి నాని స్పందించారు. ప్రపంచంలోని తెలుగువారందరూ గర్వపడేలా ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తెలుగు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్‌ జిల్లాను ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామని మంత్రి తెలిపారు.

సీఎం జగన్ ఒకసారి మాట ఇస్తే దానిపై నిలబడతాడని మంత్రి కొనియాడారు. సీఎం జగన్ ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయటానికి పూనుకున్నారని మంత్రి నాని తెలియజేశారు. ఎన్నికలకు ముందు జగన్ పాదయాత్ర సమయంలో నిమ్మకూరు వచ్చినప్పుడు.. తనతో పాటు, ఆ గ్రామంలోని వారందరూ కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెట్టాలని కోరామని.. అప్పుడు ఆయన దానికి ఒప్పుకున్నారని మంత్రి గుర్తుచేశారు. ఇప్పుడు ఆ మాట నిలపెట్టుకున్నారని సీఎం జగన్ ని మంత్రి కొడాలి నాని ప్రశంసించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here