ఆస్ట్రేలియన్ ఓపెన్-2022 : ఫైనల్ కు చేరిన రఫెల్ నాదల్, టైటిల్ గెలిస్తే చరిత్ర!

Australian Open 2022, Australian Open 2022 final, Australian Open 2022 Rafael Nadal Reached to Final, Mango News, Nadal on reaching 29th Major final in Aus Open, Rafael Nadal beats Matteo Berrettini to reach Australian Open, Rafael Nadal books place in 6th final, Rafael Nadal On Reaching Australian Open Final, Rafael Nadal outplays Matteo Berrettini to reach sixth Australian Open final, Rafael Nadal Reached to Final, Rafael Nadal reaches Australian Open 2022 final, Rafael Nadal reaches Australian Open final, Rafael Nadal storms into Australian Open 2022, Rafael Nadal storms into Australian Open 2022 final

ఆస్ట్రేలియన్ ఓపెన్-2022 పురుషుల సింగిల్స్ సెమీఫైనల్‌ లో స్పెయిన్ దిగ్గజ ఆటగాడు రఫెల్ నాదల్ అద్భుత విజయం సాధించాడు. శుక్రవారం నాడు జరిగిన సెమీఫైనల్లో రెండు గంటల 55 నిమిషాల పాటు జరిగిన పోరులో ఇటలీ ఆటగాడు, ఏడో సీడ్ మాటియో బెర్రెట్టినిని 6-3, 6-2, 3-6, 6-3 స్కోరుతో ఓడించి ఫైనల్ కు చేరుకున్నాడు. రఫెల్ నాదల్ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్ కు చేరుకోవడం ఇది ఆరో సారి. కాగా 21 గ్రాండ్ స్లామ్ టైటిళ్లను గెలుచుకున్న మొదటి వ్యక్తిగా అవతరించి, చరిత్ర సృష్టించేందుకు రఫెల్ నాదల్ ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు.

ప్రస్తుతం అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్స్‌ గెలిచిన ఆటగాళ్ళుగా రఫెల్ నాదల్(20), రోజర్ ఫెదరర్‌ (20), నోవాక్‌ జకోవిచ్‌ (20) సమంగా ఉన్నారు. రఫెల్ నాదల్ ఆస్ట్రేలియన్ ఓపెన్-2022 ఫైనల్లో గెలిస్తే అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు (21) సాధించిన ఆటగాడిగా నిలవనున్నాడు. ఇక రెండో సెమీఫైనల్లో నాలుగో సీడ్ సిట్సిపాస్ తో రెండో సీడ్ డానిల్‌ మెద్వెదేవ్ తలపడుతున్నాడు. వీరిలో ఫైనల్ చేరుకున్న వారితో ఆదివారం నాడు జరిగే ఫైనల్లో టైటిల్ కోసం రఫెల్ నాదల్ తలపడనున్నాడు. మరోవైపు టోర్నమెంట్ కు ముందే నోవాక్ జొకోవిచ్ ఆస్ట్రేలియా నుండి బహిష్కరించబడగా, రోజర్ ఫెదరర్ గాయం కారణంగా ఆస్ట్రేలియన్ ఓపెన్ లో పాల్గొనలేదు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here