నేడు మంత్రుల కమిటీ భేటీ.. పీఆర్సీ స్టీరింగ్ కమిటీకి ఆహ్వానం

AP Employees PRC Issue, AP government calls staff unions for talks on payscales, AP Government Employees Strike, Government employees in Andhra Pradesh gear up for strike, Invitation to PRC Steering Committee, Mango News, Ministers Committee, Ministers Committee to Meet Today, Ministers Committee to Meet Today Invitation to PRC Steering Committee, PRC, PRC Issue, PRC Issue in Ap, PRC Steering Committee, Staff unions firm on stir from Feb 7

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీఆర్సీపై మొదలైన రగడ.. చివరకు సమ్మెకు దారి తీస్తోంది. ప్రభుత్వానికి.. ఉద్యోగులకు మధ్య ఏర్పడిన ప్రతిష్ఠంభన తొలగించడానికి ప్రభుత్వం మంత్రులతో ఒక కమిటీని నియమించింది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో మంత్రుల కమిటీ సమావేశం కానుంది. ఉద్యోగులతో చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని.. పీఆర్సీ విషయంలో ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య కమిటీ వారధిలా పని చేస్తుందని చెప్పారు. సమావేశానికి రావాలని పీఆర్సీ స్టీరింగ్ కమిటీ సభ్యులకు మంత్రుల కమిటీ ఆహ్వానించింది.

అయితే, మంత్రుల కమిటీ భేటీకి వెళ్లేది లేదంటుూ ఉద్యోగ సంఘాల నేతలు తేల్చి చెబుతున్నారు. పీఆర్సీ జీవోల రద్దు, మిశ్రా కమిటీ నివేదిక బహిర్గతం.. పాత జీతాలు వేస్తేనే చర్చలకు వెళ్తామని ఇప్పటికే ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. ఉదయం 11వ పీఆర్సీ సాధన సమితి స్టీరింట్ కమిటీ భేటీకానుంది. ప్రతినిధి ద్వారా మంత్రుల కమిటీకి లేఖ పంపాలని నిర్ణయించారు. పీఆర్‌సీపై ఉద్యోగులలో నెలకొన్న అపోహలను తొలగించి సందేహాల నివృత్తికి రాష్ట్ర ప్రభుత్వం మంత్రులతో కమిటీని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సీఎస్‌ సమీర్‌ శర్మ కమిటీ సభ్య కన్వీనర్‌గా ఉంటారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్, పేర్ని నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కమిటీలో ఉన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + eleven =