పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకున్న 3లక్షల 3వేల మంది

One More Day For Postal Ballot, Postal Ballot Polling, Postal Ballot Huge Response, 3 Lacks 3 Thousand, AP Elections 2024, A Huge Response To The Postal Ballot, Teachers, Employees, Postal Ballot, Postal Ballot AP, Postal Ballot News, Assembly Elections, Lok Sabha Elections, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
AP Elections 2024,A Huge response to the postal ballot, teachers,employees,postal ballot

ఏపీలో పోలింగ్ కంటే ముందే జరుగుతున్న హోం ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ వంటి వాటితో ఏపీ పోలింగ్ వాతావరణం హీటెక్కుతోంది.  హోం ఓటింగ్ లో 80 ఏళ్లు పైబడిన వారితో పాటు, 40 శాతానికి పైగా అంగవైకల్యంతో బాధపడే దివ్యాంగులు పాల్గొనగా.. పోస్టల్ బ్యాలెట్ లో పోలింగ్ విధుల నిర్వహణలో భాగం పంచుకునే ఉద్యోగులు పాల్గొంటున్నారు. హోం ఓటింగ్ కు అనుకున్నంత స్పందన రాలేదన్న ఎన్నికల అధికారులు .. పోస్టల్ బ్యాలెట్‌కు మాత్రం విశేష స్పందన వస్తుందని అంటున్నారు. అయితే ముందుగా అనుకున్న సమయానికంటే ఈసీ అధికారులు ఒక రోజు గడువును పొడిగించారు.

మొత్తంగా ఇప్పటి వరకూ 3లక్షల 3వేల మంది పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకున్నారని ఏపీ సీఈఓ ఎంకే మీనా చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ వివియోగానికి మరో రోజు గడువు పొడిగించినట్లు ప్రకటించిన ఆయన.. కొన్ని చోట్ల 12-డి ఫారాలు అందడంలో జాప్యం జరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అంతే కాదు మరోవైపు   ప్రభుత్వం ఇచ్చే పథకాలనేవీ ఆపమని  ఎన్నికల సంఘం చెప్పిందని వస్తున్న వార్తలను ఆయన కొట్టి పడేశారు. కొంత కాలం తర్వాత ఇవ్వమని మాత్రమే ఎన్నికల సంఘం స్పష్టం చేసిందని  మీనా చెప్పారు.

మరోవైపు  ఇప్పటి వరకూ జరిగిన  ప్రతి ఎన్నికల్లోనూ పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు సంబంధించిన  దరఖాస్తులు లక్షన్నర వరకూ  వచ్చేవి. ఎన్నికల విధులకు హాజరుకావాల్సి ఉండటంతో  కొంతమంది పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేయడానికి ముందుకు వచ్చేవారు కాదు. మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాలకు వెళ్లి ఓటు వేయాలా అని ఆలోచించి  ఎక్కువమంది ఓటు వేసేవారు కాదు. కానీ ఈసారి  రాష్ట్రవ్యాప్తంగా ఐదు లక్షల మంది ఉద్యోగులు తమ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కోసం దరఖాస్తు చేసుకోవడం ఈసీ అధికారులునే షాక్ గురయ్యేలా చేస్తోంది.

నిజానికి ఈ  పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు సంబంధించి కూడా వైసీపీ ప్రభుత్వం ఎన్నో రకాల ఇబ్బంది పెట్టినా.. వాటన్నింటిని అధిగమించి ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ లను పొంది.. నిన్నటి నుంచి ఓటు వేయడం ప్రారంభించారు. దీనిలో 90శాతం మంది వైసీపీ వ్యతిరేక ఓట్లు వేసినట్లు తెలుస్తోంది. చాలామంది తమ ఓటు  విషయాన్ని బాహటంగానే చెప్పుకుంటున్నారు. వైసీపీపై తమ కడుపు మంట తీర్చుకోవడానికి పెద్ద ఎత్తును తరలిరావడంతోనే ఇంత పెద్ద సంఖ్యలో పోస్టల్ బ్యాలెట్ శాతం పెరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 4 =