రైతులకు ధాన్యం సొమ్ములు చెల్లించడంలో ప్రభుత్వం విఫలం: పవన్ కళ్యాణ్

compensation money for farmers News, Govt to Pay Paddy Purchase Money to Farmers, janasena chief pawan kalyan, Mango News, pawan kalyan, Pawan Kalyan Demands Govt to Pay Paddy Purchase Money, Pawan Kalyan Demands Govt to Pay Paddy Purchase Money to Farmers, Pawan Kalyan Demands Govt to Pay Paddy Purchase Money to Farmers by Month End, Pawan Kalyan Pawan Kalyan, Pawan Kalyan’s ultimatum to Jagan Sarkar, Pawan Kalyan’s ultimatum to Jagan Sarkar in favor of farmers

రైతులకు ధాన్యం సొమ్ములు చెల్లించడంలో ప్రభుత్వం విఫలం అయిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ నెలాఖరులోగా ప్రతి గింజకు డబ్బులు చెల్లించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఇవ్వని పక్షంలో రైతుల కోసం పోరాడతామని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రబీ సీజన్లో పండించిన ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించి నెలలు గడుస్తున్నా డబ్బులు చెల్లించకుండా ఆ కష్ట జీవులతో ప్రభుత్వం కనీళ్లు పెట్టిస్తోందని అన్నారు. రూ.3 వేల కోట్లకుపైగా వరి పండించిన రైతులకు బకాయిపడిందని అన్నారు. రబీ సీజన్లో కొన్న ధాన్యానికి సంబంధించి ఉభయ గోదావరి జిల్లాల్లోనే రూ.1800 కోట్లు వరకూ రైతులకు బకాయిలు ఉన్నాయి. ధాన్యం కొనుగోలుకు సంబంధించిన వివరాలను, లెక్కలను ప్రభుత్వ వెబ్ సైట్ నుంచి ఎందుకు తొలగించారో రైతులకు సమాధానం చెప్పాలి. కొనుగోలు, బకాయిల విషయంలో ప్రభుత్వం గోప్యత ఎందుకు పాటిస్తోంది? అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.

నెలాఖరులోగా రైతుల బకాయిలు చెల్లించని పక్షంలో రైతులకు జనసేన పార్టీ అండగా నిలిచి పోరాడుతుందని స్పష్టం చేశారు. ఇంతకు ముందు కూడా రైతుల కోసం కాకినాడలో ‘రైతు సౌభాగ్య దీక్ష’ చేపడితేనే ప్రభుత్వం దిగి వచ్చి రైతులకు సొమ్ములు జమ చేసిందని, రబీ డబ్బులు వస్తేనే ఈ సీజన్లో పంటకు పెట్టుబడి ఉంటుందని అన్నారు. “రబీ డబ్బులు రాక, రుణాలు అందకపోతే వ్యవసాయ పనులు ఎలా మొదలుపెడతారు. పంట నష్ట పరిహారం కూడా సక్రమంగా చెల్లించరు. ఇలాంటి పరిస్థితులోనే కోనసీమలోని గ్రామాల్లో రైతులు ఇక పంట వేయబోమని క్రాప్ హాలిడే ప్రకటించారు. ఇందుకు ప్రభుత్వ వైఖరే కారణం. జొన్న, మొక్క జొన్న కొనుగోలు విషయంలోనూ రైతులను పార్టీలవారీ విడదీయడం దురదృష్టకరం. అధికార పార్టీకి మద్దతుగా ఉన్న వారి నుంచే పంటను కొన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలను అందించడంలోనూ పార్టీ లెక్కలే చూస్తున్నారు. పండించే పంటకీ, తినే తిండికీ పార్టీ రంగులు పులమడం దిగజారుడుతనమే. మిర్చి రైతులకు అవసరమైన విత్తనాలు అందకపోవడంతో మార్కెట్లోకి నకిలీ విత్తనాలు వచ్చినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. నకిలీ విత్తనాలు, పురుగుల మందుల వ్యాపారులపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ఎందుకు వెనుకంజ వేస్తోంది? విత్తనాల సరఫరా నుంచి పంట కొనుగోలు వరకూ, పంట నష్టపరిహారం, బీమా చెల్లింపుల్లో ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తోంది. జనసేన పార్టీ ఎప్పుడూ రైతుల పక్షాన ఉంటుంది. వారి కోసం పోరాడుతుంది” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × one =