పీఆర్సీ అంశంపై ఏపీ ఉద్యోగులు ఆందోళన, స్పందించిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌

Andhra govt employees strike over pay revision, Andhra Pradesh Government, Andhra Pradesh govt employees, AP Employees PRC Issue, AP Employees Strike, AP employees threaten strike, AP Employees Unions Calls For Strike, AP Employees Unions Calls For Strike Regarding PRC Issue, EX MP Undavalli Arun Kumar, Ex-MP Undavalli Arun Kumar Responds over AP Employees PRC Issue, Mango News, PRC Issue, PRC Issue in Ap, Undavalli, Undavalli Arun Kumar Responds over AP Employees PRC Issue, Undavalli Arun Kumar Responds over PRC Issue

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీఆర్సీ అంశంపై ఉద్యోగులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఉద్యోగులు ఏపీ సీఎస్‌ కు సమ్మె నోటీస్ ఇచ్చే దిశగా ఆలోచన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల ఆందోళనపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ సోమవారం నాడు స్పందించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘కొత్త పీఆర్సీ అమలు చేయటం వల్ల 10,247 కోట్ల అదనపు భారం పడుతుందని ప్రభుత్వం అంటుంటే, ‘మాకు పెంచిన కొత్త జీతాలు వద్దు, పాత జీతాలు చాలు’ అంటూ ఉద్యోగ సంఘాలు సమ్మెకు దిగుతున్నారు. ఇలాంటి పరిస్థితి నేనెప్పుడూ చూడలేదు. జీతాలు పెంచాలంటూ సమ్మెలు చేయడం చూశాను కానీ పెంచిన జీతాలు మాకొద్దు అంటూ సమ్మె నోటీసు ఇవ్వడం బహుశా ఇదే ప్రథమం అనుకుంటా! ఒక పక్క కరోనా బీభత్సం, మరోక పక్క కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దుస్థితిని దృష్టిలో పెట్టుకుని సమ్మెను ఆపవల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ప్రభుత్వము, ఉద్యోగ సంఘాలు పట్టింపులకు పోకుండా చర్చల ద్వారా సమస్య పరిష్కరించ సాధించ ప్రార్ధన’’ అని ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ప్రకటనలో పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 2 =