రైతుల ఖాతాల్లో మొత్తం రూ.1766 కోట్లు జమ : సీఎం వైఎస్ జగన్

CM YS Jagan Launches Payment of Rythu Bharosa and Nivar Cyclone Input Subsidy,Mango News,Mango News Telugu,Ys Jagan Mohan Reddy,Nivar Cyclone,Andhra Pradesh,Input Subsidy,3rd Phase Of YSR Rythu Bharosa,Cyclone Nivar Compensation On December 29,CM Jagan Pay Rythu Bharosa,Nivar Cyclone Relief Fund,AP CM YS Jagan Launches YSR Rythu Bharosa 3rd Phase,Tadepalli,AP CM YS Jagan Disbursing YSR Rythu Bharosa,YS Jaganmohan Reddy,YSR Rythu Bharosa,YSR Rythu Bharosa Today News,YSR Rythu Bharosa Launch,YSR Rythu Bharosa News,YSR Rythu Bharosa Scheme,YSR Rythu Bharosa Details,YSR Rythu Bharosa Latest Updates,3rd Phase YSR Rythu Bharosa,CM YS Jagan Disbursing YSR Rythu Bharosa,YS Jagan Disbursing YSR Rythu Bharosa

ఆంధ్రపప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ ‌మోహన్ ‌రెడ్డి మంగళవారం నాడు వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ 3 వ విడత నిధులు, నివర్ తుపాను కారణంగా నష్టపోయిన వ్యవసాయ, ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లింపులను ప్రారంభించారు. 3వ విడత రైతుభరోసా రూ.1,120 కోట్లు, నివర్ తుపాను పరిహారం కింద రూ.646 కోట్లు కలిపి మొత్తంగా రూ.1,766 కోట్లను కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లో నేరుగా జమచేసే పక్రియను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ చరిత్రలో ఎన్నడూ లేనంత వేగంగా పంట నష్టపరిహారం, సంక్రాంతికి ముందే రైతుభరోసా నిధులు విడుదల చేస్తున్నామని చెప్పారు. రైతుబాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మి రైతు పక్షపాత విధానాలు తెచ్చిన ప్రభుత్వం ఇదని పేర్కొన్నారు. వైఎస్ఆర్ రైతు భరోసా, సున్నా వడ్డీ బకాయిలు, వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ, ఉచిత విద్యుత్‌, గ్రామాల్లో గోడౌన్లు, ప్రైమరీ ప్రాసెసింగ్‌ సెంటర్లు ఏర్పాటు ఇలా రాష్ట్రంలో రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు సంక్షేమ కార్యక్రమాల గురించి సీఎం వైఎస్ జగన్ వివరించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + twenty =