జలదీక్షకి వెళ్తున్న జగ్గారెడ్డి అరెస్ట్

Jagga Reddy Taken Into Custody Ahead of Jala Deeksha, jaggareddy Latest News, Mango News, MLA Jagga Reddy taken into custody ahead of Jaladeeksha, Sangareddy mla jaggareddy arrested before his jala deeksha, Telangana Congress leader Jagga Reddy arrested for Jala Deeksha, Telangana Political News

సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని, సోమవారం జలదీక్షకు వెళుతున్న సమయంలో పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. జగ్గారెడ్డి కాన్వాయ్‌ను పోలీసులు అడ్డగించి, శాంతిభద్రతల సమస్య నేపథ్యంలో అరెస్టు చేశారు. గత కొంత కాలంగా సంగారెడ్డి పట్టణంలోని ప్రజలు తాగునీటి కొరత సమస్యతో బాధపడుతున్నందు వలన, గోదావరి నీటిని సంగారెడ్డికి తరలింపు చేయాలని జగ్గారెడ్డి పదే పదే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు, అయినా ప్రభుత్వం స్పందించకపోవడం వలన, నీటిని తరలిస్తామని వెంటనే ప్రభుత్వం హామీ ఇచ్చేవరకు తాను ‘జలదీక్ష’ చేస్తానని చెప్పి, జలదీక్షకు ఏర్పాట్లు చేసుకున్నారు.

ఈ నేపథ్యంలో జలదీక్ష పేరుతో నిరసన ప్రారంభించడానికి వెళుతున్న ఎమ్మెల్యే జగ్గారెడ్డిని అరెస్టు చేసి కొండపూర్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సంగారెడ్డిలో ప్రజలు ఎదురుకుంటున్న త్రాగునీటి సమస్యపై సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు ఎలాంటి అవగాహనా లేదని జగ్గారెడ్డి ఆరోపించారు. హరీష్ రావు, సింగూర్ రిజర్వాయర్ నుండి సిద్దిపేటకు నీటిని తరలించాడని, దాని ఫలితం గానే, సంగారెడ్డి పట్టణంలో ప్రజలు త్రాగు నీటి సమస్య ఎదురుకుంటున్నారని ఆయన ఆరోపించారు.

[subscribe]
[youtube_video videoid=MLsdz-FmqEA]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − ten =