చీరాలలో ఇక తాడోపెడో!

Political Heat With The Arrival Of Amanchi Krishnamohan, Political Heat, Arrival Of Amanchi Krishnamohan, Amanchi Krishna Mohan Contest From Congress, Amanchi Krishna Mohan, Chirala Congress Seat, Chirala, Chirala Politics, Chirala Lok Sabha Seat, AP Political News, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telug
amanchi krishna mohan likely to contest from congress from chirala telugu news

అనుకున్నట్లుగానే మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. వచ్చే ఎన్నికల్లో చీరాల నుంచి కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేస్తానని ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో గానీ, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో గానీ తనకు వ్యక్తిగత విభేదాలు లేవని, వ్యక్తిగత కారణాలతోనే బయటకు వచ్చానని ఇటివలీ వైసీపీకి రాజీనామా చేసిన కృష్ణ మోహన్ చెప్పారు. చంద్రబాబుపై తనకు అన్ని గౌరవాలు ఉన్నాయని, కానీ టీడీపీ సిద్ధాంతాలకు తాను సర్దుకుపోలేకపోయానని చెప్పారు. అందుకే 2019లో టీడీపీ నుంచి బయటకు వచ్చానని చెప్పారు. వైసీపీలో కూడా జగన్ తనకు గౌరవం ఇచ్చారని, ఆయనతో తనకు ఎలాంటి గ్యాప్ లేదన్నారు. వాస్తవానికి జగన్ తనను పర్చూరు నుంచి పోటీ చేయమని అడిగారని, కానీ చీరాల తన సొంత నియోజకవర్గం కావడంతో తిరస్కరించానని చెప్పారు. అందుకే బయటకు వచ్చానన్నారు.

బ్యాక్‌ టు కాంగ్రెస్:

చీరాలలో ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని భావించినప్పటికీ తనకు రాజకీయ జీవితాన్నిచ్చిన కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వెళ్లాలని తన కుటుంబ సభ్యులు, నియోజకవర్గ ప్రజలు సూచించారని కృష్ణమోహన్ చెప్పారు. ఆటో రిక్షా గుర్తుపై పోటీ చేయాలని భావించానని, కానీ భారత ఎన్నికల సంఘం ఆ గుర్తును రద్దు చేసిందన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరి హస్తం గుర్తుపై పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. చీరాలలో ఇసుక మాఫియా, గ్రానైట్ మాఫియాకు పాల్పడి పోలీసుల అండదండలతో నియోజకవర్గంలో బీభత్సం సృష్టించింది కరణం కుటుంబమేనని ఫైర్ అయ్యారు. కరణం కుటుంబాన్ని ఓడించే అవకాశం కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారన్నారు.

ఆమంచి ఫ్రొఫైల్:

ఆమంచి కృష్ణమోహన్ 1975లో ప్రకాశం జిల్లా పందిళ్లపల్లి గ్రామంలో జన్మించారు. తెనాలిలోని ఏఎస్ఎన్ కళాశాల నుంచి బీఎస్సీ పట్టా పొందారు. భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి 2000లో వేటపాలెం మండలం నుంచి జెడ్పీటీసీ సభ్యుడిగా, 2009లో చీరాల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా, 2014 ఎన్నికల్లో చీరాల నుంచి స్వతంత్ర సభ్యుడిగా గెలుపొందిన ఆయన ఎన్నికల తర్వాత తన పార్టీని తెలుగుదేశంలో విలీనం చేశారు. 2019 ఫిబ్రవరిలో తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీ పార్టీలో చేరారు. ఇప్పుడు వైసీపీ నుంచి తిరిగి మళ్లీ కాంగ్రెస్‌ గూటికి వెళ్లనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − ten =