ఏపీలో 7 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు మొదలైన పోలింగ్.. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్

Polling Begins For 7 MLC Seats Under MLA Quota in AP Assembly Counting To be Started at 5 pm,Polling Begins For 7 MLC Seats,MLC Seats Under MLA Quota in AP Assembly,MLC Seats Counting To be Started at 5 pm,Mango News,Mango News Telugu,Polling for 7 MLC Seats Under MLA Quota,Ysrcp Eyes All 7 Seats From Assembly Quota,MLC Elections 2023,Andhra Pradesh MLC Elections,AP Assembly,Andhra Pradesh Election Latest News,AP Politics,Andhra Pradesh MLC Elections Live News,Andhra Pradesh MLC Seats Latest News

ఆంధ్రప్రదేశ్‌లోని ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. ఈ మేరకు వెలగపూడిలోని తాత్కాలిక అసెంబ్లీ ప్రాంగణంలో గురువారం ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో పోలింగ్‌ జరుగుతోంది. అసెంబ్లీలోని కమిటీ హాల్ నంబర్-1లో ఈ ఉదయం తొమ్మిది గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. కాగా ఒక్కో ఎమ్మెల్సీ గెలవాలంటే 22 మంది సభ్యుల ఓట్లు అవసరం. ఇక ఏపీ శాసనసభలో మొత్తం సభ్యుల సంఖ్య 175 ఉండగా.. అధికారిక లెక్కల ప్రకారం వైఎస్సార్‌సీపీకి 151, టీడీపీకి 23, జనసేనకు ఒక సభ్యుడు ఉన్నారు. అయితే టీడీపీకి చెందిన నలుగురు సభ్యులు ఆ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో ప్రస్తుతం టీడీపీకి 19 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. జనసేన సభ్యుడు కూడా అధికార వైసీపీతో సన్నిహితంగా ఉంటున్నారు.

అలాగే వైఎస్సార్సీపీకి చెందిన ఒకరిద్దరు సభ్యులు ఆ పార్టీతో విభేదిస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ మొత్తం ఏడు స్థానాలకు అభ్యర్థులను బరిలోకి దింపగా.. ప్రతిపక్ష టీడీపీ ఒక స్థానానికి తన అభ్యర్థిని పోటీలో నిలిపింది. దీంతో క్రాస్ ఓటింగ్ జరగొచ్చని ఇరు పార్టీలు అంచనా వేస్తున్న నేపథ్యంలో ఏపీ అసెంబ్లీలో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే దీనికి సంబంధించి వైసీపీ రెండుసార్లు మాక్ పోలింగ్ నిర్వహించి తన ఎమ్మెల్యేలకు కీలక సూచనలు చేసింది. ఇక పోలింగ్ నేటి సాయంత్రం నాలుగు గంటలకు ముగియనుండగా.. ఐదు గంటల నుంచి కౌంటింగ్‌ ప్రారంభమవుతుంది. అనంతరం రాత్రి లోపు అధికారులు ఫలితాలను ప్రకటించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × five =