ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం.. బీజేపీలో చేరిన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి

AP Senior Politician Former CM Nallari Kiran Kumar Reddy Joins BJP Today,AP Senior Politician Nallari Kiran Kumar Reddy,Former CM Nallari Kiran Kumar Reddy Joins BJP,Nallari Kiran Kumar Reddy Joins BJP Today,Mango News,Mango News Telugu,Former Andhra Pradesh CM Kiran Kumar Reddy,Last CM of Undivided Andhra Pradesh,Nallari Kiran Kumar Reddy Likely To Join BJP,Kiran Kumar Reddy likely to join BJP,AP Latest Political News,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,Andhra Pradesh News and Live Updates,Former CM Nallari Kiran Kumar Reddy Latest News

ఆంధ్రప్రదేశ్‌లో పార్టీని బలోపేతం చేసే దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. ఇక మార్చి 12న కాంగ్రెస్‌కి రాజీనామా చేసిన ఆయన, శుక్రవారం ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి కిరణ్ కుమార్ రెడ్డికి కాషాయ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఇక ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్యనేతలు అరుణ్ సింగ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఆఖరి సీఎంగా, అంతకుముందు స్పీకర్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్‌కు రాజీనామా చేసి జై సమైక్యాంధ్ర పేరుతో పార్టీ పెట్టారు. అయితే 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. దీంతో మళ్లీ కాంగ్రెస్ లోకి రీఎంట్రీ ఇచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి, కొంతకాలం ఆ పార్టీలో కొనసాగారు. ఈ క్రమంలో మరోసారి కాంగ్రెస్‌కి రాజీనామా చేసి నేడు బీజేపీలో జాయిన్ అయ్యారు. జాతీయ స్థాయిలో ఆయనకు కీలక పదవికి అప్పగించేందుకు అధిష్టానం హామీ ఇచ్చిన మేరకు కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరినట్లుగా ప్రచారం జరుగుతోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + 3 =