ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలపై స్పందించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

Sajjala Ramakrishna Reddy Reacts On Early Elections Comments in Andhra Pradesh, Sajjala Ramakrishna Reddy Reacts On Early Elections Comments in AP, Sajjala Ramakrishna Reddy, Advisor to the Government of Andhra Pradesh, Sajjala Ramakrishna Reddy Advisor to the Government of Andhra Pradesh, Government of Andhra Pradesh, Advisor to the Government of Andhra Pradesh for public affairs, Early Elections Comments in AP, Early Elections Comments, Early Elections, Early Elections Latest News, Early Elections Latest Updates, Early Elections Sensational Comments, Early Elections Sensational Comments in AP, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు తమకు ఐదేళ్లు పరిపాలించమని అవకాశం ఇచ్చారని.. ఆ నిర్ణయాన్ని శిరసావహిస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించిన నేపథ్యంలో.. సజ్జల దీనిపై స్పందించారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన తమకు లేదని, కావాలనే దీనిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నేడు వైఎస్సార్‌సీపీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వేడుకల్లో పాల్గొన్న సజ్జల కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

రెండేళ్ల పాలనలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. నవరత్నాల అమలుతో ప్రజల మనస్సులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారని వెల్లడించారు. మా పార్టీ కార్యకర్తలు వైఎస్‌ కుటుంబంపై అపారమైన విశ్వాసం చూపిస్తారని తెలిపారు. ఆ నమ్మకాన్ని కాపాడుకుంటామని అన్నారు. పార్టీ బలోపేతం, ప్రభుత్వ పాలన రెండూ ముఖ్యమేనని స్పష్టం చేశారు. మంత్రివర్గ విస్తరణపై మాట్లాడుతూ, త్వరలోనే సీఎం జగన్ మంత్రివర్గ విస్తరణ చేస్తారని వెల్లడించారు. మంత్రివర్గ విస్తరణలో భాగంగా  పదవి కోల్పోయిన వారిని పార్టీపరంగా ఉపయోగించుకుంటామని హామీ ఇచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × three =