మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో జాప్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

Supreme Court Serious on CBI For Delaying The Investigation in Vivekananda Reddy Assassination Case,Supreme Court Serious on CBI,Supreme Court Serious on Delaying The Investigation,Investigation in Vivekananda Reddy Assassination Case,Mango News,Mango News Telugu,SC Pulls up CBI For Delay in Viveka Murder,SC Questions CBI Over Delay in Vivekananda Murder,Murder probe of YS Vivekananda Reddy,Vivekananada Reddy Murder,Vivekananda Reddy Case Latest News,Viveka Murder Latest Updates

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తును పూర్తి చేయడంలో తీవ్ర జాప్యం చేయడంపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)పై సుప్రీంకోర్టు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో తాజా స్థితిపై పూర్తి నివేదికను సీల్డ్ కవర్‌లో సమర్పించాలని సీబీఐని ఆదేశించింది. కాగా సీబీఐ విచారణపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, విచారణ సాకుతో తన భర్త ఎక్కువ కాలం జైలులో కొనసాగుతున్నారని నిందితుడు డి. శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది. విచారణ సందర్భంగా, జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సీటీ రవి కుమార్‌లతో కూడిన డివిజన్ బెంచ్ తాజా స్థితిని తెలియజేయాలని కోరారు. దీనికి సీబీఐ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ నటరాజన్ బదులిస్తూ దర్యాప్తు సరిగ్గా జరుగుతోందని చెప్పారు.

దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. విచారణ సజావుగా సాగితే సంవత్సరాలు పడుతుందా? ఇంకా జాప్యం జరిగెటట్లైతే దర్యాప్తు అధికారిని మార్చండి లేదా సీబీఐ డైరెక్టర్‌కు తెలియజేయాలని సూచించింది. ఇక దర్యాప్తు అధికారిని మార్చవచ్చో లేదో సీబీఐ డైరెక్టర్‌ నుంచి నిర్ధారించుకోవాలని నటరాజన్‌ను ఆదేశించిన న్యాయస్థానం, అనంతరం కేసును మార్చి 27కి వాయిదా వేసింది. కాగా వైఎస్ వివేకానంద రెడ్డి 2019 మార్చి 15న పులివెందుల లోని తన స్వగృహంలో హత్యకు గురయ్యారు. దీనిలో కొందరి ప్రమేయంపై అనుమానం వ్యక్తం చేస్తూ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తును 2020లో సీబీఐకి బదిలీ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 16 =