అకాల వర్షాలతో నష్టానికి గురైన వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లి పరిశీలించాలి, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకు కేటీఆర్ దిశానిర్దేశం

Minister KTR Directs MLAs Public Representatives to visit and Inspect Agricultural Fields Damaged by Untimely Rains,Minister KTR Directs MLAs,KTR Directs MLAs Public Representatives to visit Agricultural Fields,Agricultural Fields Damaged by Untimely Rains,MLAs to visit and Inspect Agricultural Fields,Mango News,Mango News Telugu,KTR Seeks Crop Damage Report,KTR asks BRS Leaders to Visit Farmers,KT Rama Rao Seeks Crop Damage,KTR Latest News,T Harish Rao Latest News And Updates,Telangana News

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సోమవారం నాడు పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ విస్తృతంగా నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలు మరియు ఇతర కార్యక్రమాలను సమన్వయ పరుస్తున్న పార్టీ ఇంచార్జిలు, ఇతర ప్రజాప్రతినిధులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై నేతలకు మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. అకాల వర్షాల వలన సమస్యలు ఎదుర్కొంటున్న రైతులను స్థానిక వ్యవసాయ అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించాలని, నష్టానికి గురైన వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లాలని సూచించారు. రైతు సోదరులకు ప్రస్తుతం ఉన్న ఇబ్బందికర పరిస్థితుల్లో వారికి భరోసా ఇచ్చేలా, వారికి విశ్వాసం కల్పించేలా వారితో మమేకం కావాలన్నారు. దీంతో పాటు ప్రస్తుతం ప్రభుత్వం వేగంగా చేపడుతున్న కార్యక్రమాలను పార్టీ ఎమ్మెల్యేలు పర్యవేక్షించాలని చెప్పారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు పంచాయతీరాజ్ రోడ్ల బలోపేతం అంశంపైన దృష్టి సారించి వర్షాకాలం లోపల పనులు పూర్తయ్యేలా సమన్వయం చేసుకోవాలి. గ్రామస్థాయిలో ఉపాధి హామీతో పాటు పంచాయతీరాజ్ శాఖ మరియు పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి వంటి కార్యక్రమాల్లో భాగంగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల బిల్లుల చెల్లింపుపైన ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిన నేపథ్యంలో వీటన్నింటిని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఉపాధి హామీకి సంబంధించిన 1300 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులు రాకుండా ఇంకా పెండింగ్లో ఉన్న నేపథ్యంలో బిల్లుల చెల్లింపు ఆలస్యమైందన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ పంపే ప్రత్యేక సందేశాన్ని ప్రతి కార్యకర్తకు చేరేలా చూడాలి:

“వచ్చేనెల 20నాటికి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు పూర్తి కావాలి, ఇందుకు సంబంధించి, ఇప్పటికే జిల్లా ఇంచార్జిలులాగా వెళ్లిన వారి ఆధ్వర్యంలో పార్టీ కార్యక్రమాలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా కార్యకర్తలకు ఒక సందేశాన్ని ఇవ్వబోతున్నారు. దాన్ని అన్ని ఆత్మీయ సమ్మేళనాల్లో చదివి వినిపించాలి. ప్రతి కార్యకర్తకు ఉద్యమ కాలం నుంచి పార్టీకి అండగా ఉంటూ రెండుసార్లు తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు దోహదం చేసిన విషయాన్ని వారికి గుర్తు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ పంపే ప్రత్యేక సందేశాన్ని ప్రతి కార్యకర్తకు చేరేలా చూడాలి. ప్రతి ప్రతి గ్రామాలకు నాలుగైదు డివిజన్లకు కలిపి ఒక ఆత్మీయ సమ్మేళనాలని ఏర్పాటు చేసుకోవాలని సూచించిన మేరకు ముందుకు పోవాలి. ఆత్మీయ సమ్మేళనాల్లో పార్టీ కార్యకర్తల ప్రాధాన్యత వారితో ఉన్న అనుబంధాన్ని వివరించేలా కార్యక్రమన్ని ముందుకు తీసుకుపోవాలి. సమావేశాల్లో పార్టీ శ్రేణుల ప్రాధాన్యత తెలంగాణ ప్రగతి ప్రస్థానం, తెలంగాణ రాకముందు ఉన్న పరిస్థితులు, వచ్చిన తర్వాత మారిన తెలంగాణ రాష్ట్ర ముఖచిత్రం వంటి అంశాలను స్పృశించుకుంటూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రస్థానాన్ని ప్రతీ కార్యకర్తకు అర్థమయ్యేలా వివరించాలి. దీంతోపాటు దేశంలో ప్రస్తుతం ఉన్న సామాజిక ఆర్థిక పరిస్థితుల పైన కూడా విస్తృతంగా మాట్లాడుకోవాలి. ముఖ్యంగా మోదీ ప్రభుత్వ హయాంలో పెరిగిన పెట్రోల్ ధరలతో పాటు నిత్యవసర సరుకుల ధరలు మోడీ ప్రభుత్వ విధానాల వైఫల్యాలు వంటి వాటిని మన కార్యకర్తలకు అర్థమయ్యేలా చర్చించి, ప్రజా బహుల్యంలోకి వాటిని తీసుకువెళ్లేలా చూడాలి. మోదీ ప్రభుత్వం అటు దేశ ప్రజలతో పాటు, తెలంగాణ రాష్ట్రానికి చేసిన అన్యాయాలను ప్రత్యేకంగా చర్చించాలి” అని కేటీఆర్ సూచించారు.

“తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నిధులు రాకుండా అడ్డుకోవడం, ఇవ్వాల్సిన ఇవ్వకుండా పెండింగ్లో పెట్టడం తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రగతిని అడ్డుకుంటున్న తీరును కూడా ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మన పార్టీ శ్రేణులు పైన ఉంది. రాష్ట్రంలో మహిళల అభివృద్ధి కోసం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మహిళా లోకానికి చేరేలా చూడాలి” అని కేటీఆర్ అన్నారు. ఇంకా ఎక్కడైనా ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు ప్రారంభం కాకుంటే వెంటనే ప్రారంభం చేసుకోవాలని కార్యకర్తలకు, నాయకులకు కేటీఆర్ సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఆత్మీయ సమ్మేళనాలకు రాష్ట్రస్థాయి నాయకులు, పార్టీ నేతలు ప్రత్యేక అతిథులుగా హాజరవుతారన్నారు. ఇక ఏప్రిల్ 20వ తేదీ నాటికి ఆత్మీయ సమ్మేళనాలు పూర్తి చేసుకుంటే ఏప్రిల్ 25వ తేదీన నియోజకవర్గస్థాయిలో పార్టీ ప్రతినిధుల సమావేశం నిర్వహించుకోబోతున్నాం. ఒక్కో పార్టీ ప్రతినిధుల సమావేశంలో 1000 నుంచి 1500 మంది పార్టీ ప్రతినిధులతో ఈ సమావేశాలు ఉండనున్నాయి. ఏప్రిల్ 27వ తేదీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో జెండా పండుగ కార్యక్రమం ఉంటుంది. ఏప్రిల్ 27వ తేదీన పార్టీ ప్లీనరీ జరుగుతుంది. దీనికి పార్టీ ఆహ్వానించిన ప్రతినిధులు మాత్రమే హాజరవుతారని కేటీఆర్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + 17 =